నూతన దంపతులకు చిరు శుభాకాంక్షలు

Chaitanya Jonnalagadda, Chiranjeevi, Chiranjeevi Heartfelt Note For Niharika Konidela, Chiranjeevi Pens A Heartfelt Note For Niharika Konidela, Destination Wedding, Heroine Niharika Konidela, latest telugu movies news, Latest Tollywood News, Mega Cousins, Mega family And Friends Gear Up For Niharika Konidela, Niharika Konidela And Chaitanya Will Tie The Knot In Udaipur, Niharika Konidela To Tie The Knot With Chaitanya Jonnalagadda, Nishchay, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, Udaivilas Palace

గత నాలుగైదు రోజుల నుండి మెగా వారసురాలు నిహారిక పెళ్లితో మెగా ఇంట సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. రాజస్థాన్‌.. ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌ విలాస్‌లో చైతన్య, నిహారికల పెళ్లి డిసెంబర్‌ 9, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జరగనుంది. ఇప్పటికే మెగా పరివారమంతా అక్కడికి చేరుకున్నారు. మెహందీ.. సంగీత్ కార్యక్రమాలతో అందరూ ఫుల్ హంగామాలో ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా గత రెండు, మూడు రోజుల నుంచి నిహారిక పెళ్లికి సంబంధించి పలు ఫొటోలుసోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి పోస్ట్ చేసిన ఫొటో కూడా ఇప్పుడు ఆకట్టుకుంటుంది. మెగాస్టార్ తన ట్విట్టర్‌లో చిన్నప్పటి నిహారికను ఎత్తుకున్న ఉన్నచిన్నప్పటి ఫొటోను షేర్‌ చేసి… “మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే దంపతులకు నా శుభాకాంక్షలు , ఆశీస్సులు.గాడ్‌ బ్లెస్‌ యు” అంటూ చిరంజీవి ట్వీట్ తో కాబోయే దంపతులను చిరు ఆశీర్వదించారు.

ఇక అక్కడ పెళ్లి పూర్తి చేసుకున్న తర్వాత డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో వివాహ రిసెప్షన్ జ‌ర‌పున్నట్టు తెలుస్తుంది. కాగా గుంటూరు ఐజీ జె.ప్రభాకర్‌ రావు తనయుడు చైత‌న్య‌కు ఆగ‌స్ట్ 13న నిశ్చితార్దం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఇండియన్ స్కూల్ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తిచేసిన చైతన్య ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఎంఎన్‌సి కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =