ఫైనల్ గా కుమారి నిహారిక కాస్త శ్రీమతి నిహారిక అయిపోయింది. గత నాలుగు రోజులుగా మెగా డాటర్ నిహారిక సందడి చూస్తూనే ఉన్నాం.. సోషల్ మీడియాలో పెళ్లికి సంబందించిన ఫొటోలు కూడా చాలా వైరల్ అవుతూనే ఉన్నాయి. జైపూర్‌లోని ఉదయ్‌విలాస్ ప్యాలెస్ లో ఈరోజు సాయంత్రం 7 గంటలకు కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. గుంటూరు ఐజీ జె. ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య నిహారికలో మెడలో మూడు ముళ్లు వేసాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ వేడుకలో ఇప్పటికే మెగా ఫ్యామిలీకి పెద్ద మెగాస్టార్ చిరంజీవి,సురేఖ దంపతులతో పాటు రామ్ చరణ్, ఉపాసన దంపతులతో పాటు అల్లు అర్జున్, స్నేహా రెడ్డి వచ్చారు. నిహారిక పెళ్లికి పవన్ కళ్యాణ్ రాకతో మరింత గ్లామర్ పెరిగినట్టైంది. ఆయన కొడుకు కూడా ఈ పెళ్లికి వచ్చాడు. దీనితో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి రీతూ వర్మ, లావణ్య త్రిపాఠి సహా మరికొంత మంది హాజరయ్యారు.
ఇక ప్రతి తండ్రి లాగే నాగబాబు కూడా నిహారిక పెళ్లి అవ్వడంతో భావోద్వేగం అయ్యాడు. ట్విటర్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. `తను స్కూలుకు వెళ్లిన మొదటి రోజు నాకింకా గుర్తుంది. నా చిన్నారి కూతురు స్కూలుకు వెళ్లేంత పెద్దదై పోయిందనే నిజం నమ్మడానికే నాకు చాలా ఏళ్లు పట్టింది. ఈసారి ఇంకెన్నాళ్లు పడుతుందో.. కాలమే నిర్ణయిస్తుంద`ని నాగబాబు ట్వీట్ చేశారు.
Serious nostalgia hit me all again!
It feels like the first day of her school, just that she wont be returning by evening.
It took years to make peace with the fact that my baby girl is all grown up to go to school.
Just donno how long it will be this time
Only time will decide. pic.twitter.com/8sjwxJkzaM— Naga Babu Konidela (@NagaBabuOffl) December 9, 2020
ఇక అక్కడ పెళ్లి పూర్తి చేసుకున్న తర్వాత డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో వివాహ రిసెప్షన్ జరపనున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: