కొణిదెల నాగబాబు ముద్దుల కుమార్తె నిహారికపెళ్లి సంబరాలు అంబరాన్ని అంటాయి. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ లో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఒక్క పవన్ కల్యాణ్ తప్పా మిగిలిన మెగా, అల్లు ఫ్యామిలీస్.. సన్నిహితులు అక్కడికి చేరుకున్నారు. ఈ రోజు పవన్ వేడుకలకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి రాజస్తాన్‌లో సంగీత్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొణిదెల, అల్లు వారి ఫ్యామిలీ సభ్యులు అంతా ఉత్సాహంగా పాల్గొని చిందులు వేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటికే చిరు కూడా కాబోయే నవ దంపతులకు శుభాకాంక్షలు తెలియచేసారు. ఇప్పుడు తాజాగా చరణ్ కూడా చెల్లెలు నిహా కు శుభాకాంక్షలు తెలియచేసాడు.
View this post on Instagram
కాగా రాజస్థాన్.. ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో చైతన్య, నిహారికల పెళ్లి డిసెంబర్ 9, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జరగనుంది. ఇక అక్కడ పెళ్లి పూర్తి చేసుకున్న తర్వాత డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో వివాహ రిసెప్షన్ జరపనున్నట్టు తెలుస్తుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























