మెగా స్టార్ చిరంజీవి సోదరుడు నాగేంద్ర బాబు తనయ నిహారిక , మాజీ ఐజి జొన్నలగడ్డ ప్రభాకరరావు తనయుడు చైతన్య ల వివాహం ఉదయ్ పూర్ లోని ఉదయ్ ప్యాలెస్ లో ఈ రోజు (9 వ తేదీ ) జరగనున్న విషయం తెలిసిందే. 7 వ తేదీ ఆహ్వానితులు ప్రత్యేక విమానాలలో ఉదయ్ పూర్ చేరుకున్నారు. ఉదయ్ పూర్ కు చేరుకున్న మెగా , అల్లు ఫ్యామిలీస్ సంగీత్ , మెహందీ కార్యక్రమాలలో సందడి చేశారు. తొలి రోజు జరిగిన సంగీత్ కార్యక్రమంలో మెగా హీరోలు డ్యాన్స్ లతో ఆకట్టుకున్నారు. వధూ వరులు కూడా డ్యాన్స్ లలో పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిన్న జరిగిన మెహందీ ఫంక్షన్ లో మెగా స్టార్ చిరంజీవి , పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ , సాయి ధరమ్ తేజ్ , వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, కళ్యాణ్ దేవ్ , అల్లు శిరీష్ , మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ , మెగా బ్రదర్ నాగబాబు పాల్గొన్నారు. ఒకే ఫ్రేమ్ లో మెగాహీరోలు కనపడి అభిమానులను అలరించారు. తమ అభిమాన హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూసిన అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. మెహందీ ఫంక్షన్ లో చిరంజీవి తోపాటు పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: