నాగబాబు ముద్దుల కుమార్తె నిహారికపెళ్లి రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా అక్కడకు చేరుకుంది. మెగా హీరోలంతా సందడి చేస్తున్నారు. సంగీత్ కార్యక్రమంలో భాగంగా చిరుతో సహా రామ్‌చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఇలా అందరూ కూడా చిందులేశారు. అయితే ఇప్పటివరకూ ఉన్న లోటు మాత్రం ఒక్కటే బాబాయ్ కళ్యాణ్ ఇంకా వెళ్ళకపోవడం. ఒక్క పవన్ కల్యాణ్ తప్పా మిగిలిన మెగా, అల్లు ఫ్యామిలీస్.. సన్నిహితులు అక్కడికి చేరుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు పవన్ మాత్రం ఓ వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి పవన్ కూడా నిహారిక పెళ్ళికి అక్కడికి బయలు దేరారు. కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో పవన్ ఉదయ్‌పూర్ బయల్దేరినట్టు తెలుస్తుంది. ఇక ఒక రోజు ముందే పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకోవడంతో మెగా ఫ్యామిలీలో మరింత జోష్ పెరుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కాగా రాజస్థాన్.. ఉదయ్‌పూర్‌లోని ఉదయ్ విలాస్‌లో చైతన్య, నిహారికల పెళ్లి డిసెంబర్ 9, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు జరగనుంది. ఇక అక్కడ పెళ్లి పూర్తి చేసుకున్న తర్వాత డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో వివాహ రిసెప్షన్ జరపనున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: