మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై వాస్తవ సంఘటనలతో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ షూటింగ్ గోవా షెడ్యూల్ తో కంప్లీట్ అయ్యింది. వరలక్ష్మి శరత్ కుమార్ , సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ హిట్ “బలుపు “మూవీ తరువాత శృతి హాసన్ , “క్రాక్ “మూవీ లో నటించారు.ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత శృతి తన ఫీలింగ్స్ ను వెల్లడించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“క్రాక్ “మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా శృతి హీరో రవితేజ , “క్రాక్ ” మూవీ టీమ్ కు థ్యాంక్స్ చెప్పారు. ఈ మూవీ లో తనకు అవకాశం ఇచ్చిన దర్శక , నిర్మాతలకు శృతి కృతజ్ఞతలు తెలిపారు. 6 నెలల నుండి 8 నెలల వరకూ ఫిల్మ్ సెట్స్ లో పనిచేసిన తరువాత అందరికీ గుడ్ బై చెప్పడం కష్టం గా ఉంటుందనీ , ఫిల్మ్ సెట్స్ లో కొన్ని సందర్భాలలో గ్రేటెస్ట్ ఫ్రెండ్స్ ను కలుసుకొనడం జరుగుతుందనీ, “క్రాక్ “మూవీ షూటింగ్ ను పూర్తిగా ఎంజాయ్ చేశాననీ , హీరో రవితేజ తో రెండవసారి జంటగా నటించడం సంతోషంగా ఉందనీ , యూనిట్ మెంబర్స్ ను తన కుటుంబం లా ఫీల్ అయ్యాననీ, “క్రాక్ “మూవీ ని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండనీ చెబుతూ సెట్స్ లో రవితేజ , తాను పాల్గొన్న ప్లాంక్ ఛాలెంజ్ వీడియో ను శృతి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























