మ్యూజిక్ సిట్టింగ్స్‌లో ర‌వితేజ ‘ఖిలాడి’

#RT67, Actor Ravi Teja, Actor Ravi Teja Khiladi Movie, Actor Ravi Teja Khiladi Movie Team Gets Busy In Music Sittings, Diretor Ramesh Varma, Khiladi, Khiladi Film, Khiladi Movie, Khiladi Telugu Film, Latest Telugu Movies News, Latest Tollywood News, Mass Maharaja Ravi Teja, Ravi Teja, Ravi Teja 67th Movie Khiladi First Look, Ravi Teja Khiladi Film Poster, Ravi Teja Khiladi Movie Team, Ravi Teja’s Next Is Khiladi, RT 67 Movie Khiladi, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేయగా… ఫస్ట్‌లుక్‌లో రవితేజ హుషారుగా కనిపిస్తూ ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ ముగించుకుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ప్ర‌స్తుతం చెన్నైలో మ్యూజిక్ సిట్టింగ్స్ జ‌రుగుతున్నాయి. సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీ ప్ర‌సాద్‌, ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ ఇందులో పాల్గొంటున్నారు.

కాగా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతిలను హీరోయిన్లుగా ఎంపిక చేసినట్టు సమాచారం. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతీలాల్‌ గద సమర్పణలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రఫీ సుజిత్‌ వాసుదేవ్‌ అందిస్తున్నాడు.

మరి ‘రాక్ష‌సుడు’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీతో త‌మ‌ది సూప‌ర్ హిట్ కాంబినేష‌న్ అని స‌త్య‌నారాయ‌ణ కోనేరు, ర‌మేష్ వ‌ర్మ నిరూపించారు. ఇప్పుడు ‘ఖిలాడి’ చిత్రాన్ని ఏ విష‌యంలోనూ రాజీ ప‌డ‌కుండా భారీ బ‌డ్జెట్‌తో, ఉన్న‌త ప్ర‌మాణాల‌తో తీస్తున్నారు. చూద్దాం మరి ఈసినిమా కూడా అనుకున్న అంచనాలను రీచ్ అవుతుందో..లేదో..!

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − seven =