బిగ్ బాస్ 4 – హౌస్ మేట్స్ ‘ఓపిక’ కు పరీక్ష

#BiggBossTelugu4, Akkineni Nagarjuna, BB House, Big Boss 4, bigg boss, Bigg Boss 4, Bigg Boss 4 Telugu, Bigg Boss 4 Telugu Day 93, Bigg Boss 4 Telugu Day 93 Highlights, Bigg Boss 4 Telugu Nominations List, Bigg Boss Akhil Wins Finale Ticket, Bigg Boss Telugu 4, Bigg Boss Telugu Season 4, Bigg Boss Telugu Season 4 Latest News, Latest Tollywood News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

బిగ్ బాస్ 4 – మొన్న జరిగిన రాజు రాణి టాస్క్ నిన్న కూడా కొనసాగింది. మొన్న సోహెల్, అభి, హారిక వంతు అయిపోగా.. రాత్రి ఎపిసోడ్ లో అరియానా, మోనాల్ రాణులుగా రూలింగ్ చేశారు. మీకు న‌చ్చిన వ‌స్తువు తీసుకొచ్చి, దానికి సంబంధించిన జ్ఞాప‌కాన్ని పంచుకోవాల‌ని ఆదేశించింది అరియానా. అలాగే దాన్ని ఇంట్లో న‌చ్చిన‌వాళ్ల‌కు ఇవ్వాల‌ని చెప్పింది. దీంతో సోహైల్ త‌న గుర్తుగా అభిజిత్‌కు స‌స్పెండ‌ర్‌, హారిక‌కు క‌త్తి, మోనాల్‌కు టీ ష‌ర్ట్‌, అరియానాకు ప‌ర్ఫ్యూమ్‌, అఖిల్‌కు జాకెట్‌ను ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ తర్వాత మ‌హారాణిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మోనాల్ త‌న‌లో గుడ్ బ్యాడ్ చెప్పమని అఖిల్ ను అడుగగా… ఒక మ‌నిషి నిన్ను ద్వేషించినా కూడా ఇష్ట‌ప‌డటం మంచి ల‌క్ష‌ణమైతే, సంతోషంలో త్వ‌ర‌గా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం చెడు ల‌క్ష‌ణ‌మ‌ని చెప్పాడు. అనంత‌రం అభిజిత్ ను అమ్మాయిగా నటించమని చెప్తుంది. మొత్తంగా సోహెల్, అరియానా, హారిక కూడా కలవడంతో కాస్త కామెడీ అయింది. టాస్క్ అయిపోయిన తర్వాత బెస్ట్ పెర్ఫామర్ ఎవరో చెప్పమని బిగ్ బాస్ చెప్పడంతో అభి, సోహెల్ అరియానాకు ఓటు వేయడంతో బెస్ట్ రూల‌ర్‌గా ఎంపికైంది. దీంతో ప్రేక్షకులను ఓట్లు వేయమని అడిగే ఛాన్స్ దక్కించుకుంది. నాకు మీ ప్రేమ కావాలి. ఈ ఒక్క మెట్టు న‌న్ను ఎక్కించండి. నాకు ఓటేసి సాయం చేయండి అని అభ్య‌ర్థించింది.

ఒక టాస్క్ అయిపోయి కొంచం రిలాక్స్ అవుతుండగా వెంటనే మరో టాస్క్ ఇచ్చేసాడు. కంటెస్టెంట్లు వారేంటో నిరూపించుకునేందుకు బిగ్‌బాస్ ‘ఓపిక’ అనే రెండో టాస్క్ ఇచ్చాడు. ఈటాస్క్ లో ఎలాంటి ఎక్స్‌ప్రెష‌న్ ఇవ్వ‌కుండా రోబోలా కూర్చోవాలి. మొద‌ట అరియానాతో టాస్క్ మొద‌ల‌వ‌గా ఆమెను ఇరిటేట్ చేసేందుకు సోహైల్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశాడు. ఆమె ఫేవరెట్ డ్రెస్ చింపుతాన‌ని బెదిరించాడు కానీ అంత ధైర్యం చేయ‌లేక‌పోయాడు. త‌న‌కిష్ట‌మైన‌ ఆర్వీ క‌ప్పును ప‌గ‌ల‌గొట్టినంత ప‌ని చేశాడు. త‌ర్వాత‌ మోనాల్ ఆమెకిష్ట‌మైన చింటూ బొమ్మ‌ను విసిరేసింది.

ఇక త‌ర్వాత మోనాల్ రోబోలా కూర్చోగా తన బొమ్మ విసిరేసినందుకు… మోనాల్ గతంలో విషయాలు కూడా తీసుకురావడంతో అరియానా తనకు ఉన్న పాయింట్స్ తో మోనాల్ ను నిలదీసింది. అవినాష్‌ను నువ్వు త‌న్ని మ‌రీ ఓ ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చావ‌ని చెప్పింది. నా మీద ఎంత ప‌గుందో బ‌య‌ట‌ప‌డింద‌ని తెలిపింది. నా బొమ్మ‌ను హౌస్ అవ‌తల పడేద్దామ‌నుకున్నావు, న‌న్ను హ‌ర్ట్ చేయాల‌నుకున్నావు. మ‌న‌సులో ఇంతున్న‌ప్పుడు బ‌య‌ట‌కు న‌టించావా? అని క‌డిగి పారేసింది. ఫైనల్ గా మోనాల్ టాస్క్ కూడా అయిపోయిన తర్వాత సోహెల్ వంతు వస్తుంది. ఒక పక్క టాస్క్ జరుగుతుండగా.. మరో వైపు మోనాల్ కన్నీటి పర్వంతమైంది. నేనసలు ఇక్క‌డ ఉండ‌టానికి అర్హురాలినే కాద‌న్న‌ట్లుగా చూస్తున్నారు అని బాధపడింది.

మరి ఇక ఈ రోజు సోహెల్ కు అరియానాకు పెద్ద గొడవనే జరగబోతున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి అది ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ లో చూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + thirteen =