హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ “ఉప్పెన ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం కానున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి జంటగా రూపొందిన “ఉప్పెన ” మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది. తమిళ హీరో విజయ్ సేతుపతి ఈ మూవీ లో ప్రతినాయకుడిగా నటించారు. భారీఅంచనాలు ఉన్న “ఉప్పెన ” మూవీ కరోనా కారణం గా విడుదల వాయిదా పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొదటి సినిమా రిలీజ్ కాకుండానే మరో సినిమా కు హీరోగా వైష్ణవ్ తేజ్ ఎంపిక అయ్యి , ఆమూవీ షూటింగ్ ను కంప్లీట్ చేశారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా వికారాబాద్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో “కొండ పొలం” నవల ఆధారంగా ఒక మూవీ రూపొందింది. దర్శకుడు క్రిష్ ఈ మూవీ ని 35 రోజులలో తెరకెక్కించడం విశేషం. మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక వివాహం సందర్భంగా మెగా హీరోలు ఉదయ్ పూర్ చేరుకున్న విషయం తెలిసిందే. “ఉప్పెన ” మూవీ పోస్టర్స్ లో మాస్ లుక్ లో కనిపించిన వైష్ణవ్ తేజ్ ఇప్పుడు స్మార్ట్ లుక్ లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: