కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 77

సినిమా వార్తలు

నివేత పేతురాజ్ మనసులోని కోరిక

సక్సెస్ ఫుల్ "మెంటల్ మదిలో " మూవీ తో తమిళ హీరోయిన్ నివేత పేతురాజ్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "చిత్రలహరి ", "బ్రోచేవారెవరురా ", "అల .. వైకుంఠపురములో " మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నివేత నటించిన యాక్షన్ థ్రిల్లర్ "RED " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. నివేత నటించిన రెండు తమిళ మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సాధారణంగా ఉండమంటున్న 'సామ్'..!

సమంత సినిమాల గురించి కానీ.. సమంత నటన గురించి కానీ ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి... తన నటనతో.. టాలెంట్ తో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న చాలా మంది అప్ కమింగ్ హీరోయిన్స్ కు సమంత ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. కేవలం సినిమాలే కాదు ఇంకా చాలా విషయాల్లో సమంత ఆదర్శంగా నిలుస్తుందని చెప్పొచ్చు. సమాజ సేవ చేసే విషయంలోనూ..ఫ్యాషన్ విషయంలోనూ.. సింపుల్ సిటీ లోనూ చాలా విషయాల్లో సామ్ స్పూర్తినిస్తుంది. ఇక

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"18 పేజెస్ " మూవీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ?

యంగ్ హీరో నిఖిల్ "కార్తికేయ 2", "18 పేజెస్ " మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరో గా రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ "కార్తికేయ "మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ కి సీక్వెల్ "కార్తికేయ 2 " మూవీ లో నిఖిల్ కు జోడీ గా అనుపమ పరమేశ్వరన్ ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సాంగ్

బేబీ షార్క్ సాంగ్ కు డ్యాన్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం " మూవీ లో అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణం గా ఆ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయిన రామ్ చరణ్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ ఒక సాంగ్ క్యూట్ వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మీ ప్రయాణం మాకు స్ఫూర్తి..!

హెచ్ వినోత్ దర్శకత్వంలో అజిత్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ వాలిమై సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హూమా ఖురేషి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కార్తికేయ విలన్ గా నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అధికారిక ప్రకటన అయితే రాలేదులే కానీ గతకొంత కాలంగా ఈ వార్త వినిపిస్తూనే ఉంది. ఇక ఇప్పుడు అజిత్ గురించి కార్తికేయ చేసిన ట్వీట్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రానా పెళ్లికి కరోనా టెస్ట్..!

టాలీవుడ్ లో హీరోలు ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇప్పటికే నితిన్, నిఖిల్ సింపుల్‌గానే పెళ్లి చేసుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సింపుల్ గా పెళ్లి కానిచ్చేశారు. ఇప్పుడు మరికొందరు హీరోలు కూడా పెళ్లి వైపు అడుగులేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ ?

మెగా స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ను సూపర్ హిట్ "చిరుత " మూవీ తో దర్శకుడు పూరి జగన్నాథ్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం చేసిన విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ ను స్క్రీన్ పై పూరి జగన్నాథ్ అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. రామ్ చరణ్ పెర్ఫార్మెన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పటివరకూ వారిద్దరి కాంబినేషన్ లో ఏ మూవీ రూపొందలేదు. 13 సంవత్సరాల తరువాత ఒక మూవీ సెట్ అయ్యిందని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బ్లడ్ ప్లాస్మా దానం చేయండి -నాని

భారత దేశంలో 18 లక్షలమంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. సుమారు 38 వేల మంది ప్రాణాలు కోల్పోయారు . ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా విజృంభిస్తుంది. ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 2లక్షల 35 వేల మంది పై కరోనా ప్రభావంచూపింది. చాలా మంది కరోనా నుండి కోలుకున్నారు. కొవిడ్ -19 నుండి కోలుకున్నవారి బ్లడ్ ప్లాస్మా తో కరోనా బాధితులను రక్షించవచ్చని డాక్టర్స్ చెబుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో హీరో నాని బ్లడ్ ప్లాస్మా దానానికై పిలుపునిచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దృశ్య కావ్యం 'శంకరాభరణం' - మీకు తెలుసా మొదట ఒక్క థియేటర్.. నలుగురు ఆడియన్స్ మాత్రమే..!

సంగీతం.. సాహిత్యం.. నృత్యం ఈ మూడు అంశాలే ఆయనకు బలం. కథలో కంటెంట్ ఉంటే ఈ సినిమా అయినా ప్రేక్షకుడు ఆదరిస్తాడు అని తన సినిమాలతో చూపించాడు. కేవలం కమర్షియల్ సినిమాలే రాజ్యమేలుతున్న వేళ ఆ ఒరవడిని పక్కన పెట్టి తన సినిమాలతో వహ్ వా అనిపించుకున్న దర్శకుడు కళా తపస్వి కె.విశ్వనాథ్. ఎన్నో మరుపురాని సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఘనత ఆయనది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తేజకు కరోనా పాజిటివ్..!

టాలీవుడ్ సెలబ్రిటీస్ ను కూడా కరోనా వదలట్లేదు. షూటింగ్ లు మొదలు పెట్టిన వాళ్లకూ వస్తుంది... షూటింగ్ లకు వెళ్లని వాళ్లకు కూడా వస్తుంది. మొన్నటికి మొన్న టాలీవుడ్‌లో ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ రాజ‌మౌళికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా చెప్పాడు. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్ లో వున్నాడు. ఇక ఇప్పుడు ఈ వార్త మరిచిపోకముందే మరో డైరెక్టర్ కూడా కరోనా బారిన పడ్డట్టు తెలుస్తుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజకి క‌రోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇటీవల ఓ వెబ్ సిరీస్ షూటింగ్ లో తేజ పాల్గొన్నట్టు సమాచారం. దీంతో ఆయ‌న‌తో ప‌ని చేసిన యూనిట్ సబ్యులకు, అలాగే కుటుంబ సభ్యులకు కారోనా టెస్టులు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఎన్టీఆర్ ఫ్యాన్ సూసైడ్ - ఫ్యామిలీకి అండగా ఫ్యాన్స్

ఫ్యాన్స్ అంటే ఏదో తమ అభిమాన హీరో సినిమా చూశామా.. సోషల్ మీడియాలో సపోర్ట్ చేశామా అన్నట్టు కాకుండా సమాజ సేవ చేయడంలో కూడా ముందుంటారు ఫ్యాన్స్. ఇప్పుడు మరోసారి అలాంటి పనిచేసి శభాష్ అనిపించుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అసలు సంగతేంటో తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ - బ్రదర్ అండ్ సిస్టర్ గా కాజల్- విష్ణు..!

హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో మంచు విష్ణు కాజల్‌ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్‌ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు ఈ సినిమా చిత్రీకరణ 70 శాతం పూర్తయింది. ప్రస్తుతం కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విష్ణు, కాజల్‌ ఫస్ట్‌, సునీల్‌ శెట్టి ఫస్ట్‌ లుక్ పోస్టర్ లు రిలీజ్ చేయగా తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇటీవలే రిలీజ్ చేసిన కాజల్-విష్ణు అర్ధనారీశ్వరం రూపంలో ఉన్న పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

కరోనా పై ప్రశాంత్ వర్మ సినిమా - స్పెషల్ డే కి ఫస్ట్ లుక్..!

కరోనా నేపథ్యంలో ప్రశాంత్ వర్మ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ విషయం ఇప్పటికే ప్రకటించాడు కూడా. ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి.. ఇప్ప‌టికే 40 శాతం పూర్తి చేసుకున్న‌ట్టు తెలుస్తుంది‌. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కోసం ప్ర‌శాంత్ వ‌ర్మ కర్నూలులో ప్ర‌త్యేకంగా ఓ సెట్ ను కూడా వేశాడ‌ట‌.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆర్తి అగర్వాల్ బయోపిక్ మూవీ ?

సూపర్ హిట్ "నువ్వు నాకు నచ్చావ్ "మూవీ తో ఆర్తి అగర్వాల్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "నువ్వు లేక నేను లేను ", "ఇంద్ర ", "వసంతం ", "నేనున్నాను ", "అందాలరాముడు " మూవీస్ తో ఆర్తి అగర్వాల్ ప్రేక్షకులను అలరించారు . టాలీవుడ్ స్టార్ హీరోస్ తో సూపర్ హిట్ మూవీస్ లో నటించిన ఆర్తి అగర్వాల్ బరువు తగ్గడానికి జరిగిన లైపో ఆపరేషన్ ఫెయిల్ అయ్యి చిన్న వయసు లోనే కన్ను మూశారు. ఇప్పుడు ఆర్తి అగర్వాల్ జీవిత చరిత్ర ఆధారంగా ఒక బయోపిక్ మూవీ రూపొందనుందని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

జిమ్ లో లావణ్య త్రిపాఠి

"అందాల రాక్షసి ", "దూసుకెళ్తా ", భలే భలే మొగాడివోయ్ ", సోగ్గాడే చిన్ని నాయనా ", "అర్జున్ సురవరం " వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో లావణ్య త్రిపాఠి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. లాక్ డౌన్ సమయంలో బాధితులకు లావణ్య తన వంతు సాయం అందించారు. కరోనా వ్యాప్తి నివారణకు మాస్క్ లు తప్పనిసరి కావడంతో మాస్క్ లు తయారుచేసి ప్రజలకు అందుబాటులో ఉంచడమే కాకుండా , కొన్ని ప్రాంతాలలో మాస్క్ లను లావణ్య ఉచితంగా అందజేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"గూఢచారి " మూవీ టీమ్ , అభిమానులకు థ్యాంక్స్ -అడివి శేష్

అభిషేక్ పిక్చర్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , విస్టా డ్రీమ్ మర్చంట్స్ బ్యానర్స్ పై శశి కిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "గూఢచారి " మూవీ 2018 సంవత్సరం ఆగస్ట్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. శోభిత ధూళిపాళ , మధుశాలిని , ప్రకాష్ రాజ్ , జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. సక్సెస్ ఫుల్ "గూఢచారి " మూవీ కి సీక్వెల్ "గూఢచారి 2" మూవీ రూపొందనుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

స్కూల్ కట్టిస్తున్న క్రియేటివ్ డైరెక్టర్..!

సినిమాలే కాదు సేవా కార్యక్రమాలు చేయడంలోనూ మన టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎప్పుడూ ముందుంటారన్న సంగతి పలు సందర్భాల్లో ఇప్పటికే చూశాం. ఇక ఇప్పటికే ఎంతో మంది తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే కొంతమంది చేసినవి బయటకొస్తే కొంతమంది చేసిన పనులు బయటకు రావు. ఇక ఇదిలా ఉండగా తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఒక స్కూల్ కట్టిస్తున్నారట.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆరు గెటప్స్ లో ఎన్టీఆర్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ కథానాయకులు గా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్, పీరియాడిక్ యాక్షన్ డ్రామా "రౌద్రం రణం రుధిరం "మూవీ 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. అలియా భట్ , ఒలీవియా కథానాయికలు కాగా అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'చంద్రముఖి 2' లీడ్ యాక్ట్రెస్ పై లారెన్స్ క్లారిటీ..!

పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ స్టైల్‌కు, జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతున్న సంగతి కూడా తెలిసిందే. ఈ విషయాన్ని స్యయంగా దర్శకుడు, హీరో అయిన రాఘవ లారెన్స్ ఇటీవలే ప్రకటించాడు కూడా. ఇక అప్పటినుండి చంద్రముఖి 2 పై రూమర్లు వస్తూనే ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

"ఆకాశవాణి " మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ రిలీజ్

స్టార్ డైరెక్టర్ రాజమౌళి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఏ యు &ఐ బ్యానర్ పై "ఆకాశవాణి " మూవీ రూపొందుతుంది. ఒకప్పుడు ప్రజలకు వినోద సాధనంగా ఉన్న రేడియో నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతుంది. "ఆకాశవాణి " మూవీ కి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్

షేర్