సాధారణంగా ఉండమంటున్న ‘సామ్’..!

Samantha Akkineni Shares Her No Make Up Look On Instagram With A Quirky Caption

సమంత సినిమాల గురించి కానీ.. సమంత నటన గురించి కానీ ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి… తన నటనతో.. టాలెంట్ తో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న చాలా మంది అప్ కమింగ్ హీరోయిన్స్ కు సమంత ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. కేవలం సినిమాలే కాదు ఇంకా చాలా విషయాల్లో సమంత ఆదర్శంగా నిలుస్తుందని చెప్పొచ్చు. సమాజ సేవ చేసే విషయంలోనూ..ఫ్యాషన్ విషయంలోనూ.. సింపుల్ సిటీ లోనూ చాలా విషయాల్లో సామ్ స్పూర్తినిస్తుంది. ఇక

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా తన పోస్ట్ ద్వారా కూడా అదే చెపుతుంది సమంత. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఒక ఫొటోను సమంత షేర్ చేస్తూ… `సాధారణంగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు అసాధారణంగా మారేంత సాధారణం` అంటూ కామెంట్ చేసింది.

 

 

View this post on Instagram

 

Become consciously ordinary . So ordinary that you become extraordinary.

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కాబట్టి షూటింగ్స్ కూడా లేకపోవడంతో ఇంట్లోనే ఉంటూ ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తుంది. అంతేకాదు దొరికిన ఈ టైములో గార్డెనింగ్ చేస్తుంది. ఆర్గానిక్ గా కాయగూరలు పండిస్తోంది. బయో ఎంజైమ్స్ తయారు చేస్తుంది. స్వయంగా ఇంట్లోకి కావాల్సిన సరుకులు తెచ్చుకుంటుంది. మరి సాధారణంగా ఉండటం అంటే ఇదే కదా.

ప్రస్తుతం సామ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమాతోపాటు సామ్ ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. ఇందులో విలన్ పాత్ర చేస్తుంది సామ్. మరోవైపు ఇంకా గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 2 =