దృశ్య కావ్యం ‘శంకరాభరణం’ – మీకు తెలుసా మొదట ఒక్క థియేటర్.. నలుగురు ఆడియన్స్ మాత్రమే..!

Tuesday Trivia: Interesting Fact about SankaraBharanam Movie

సంగీతం.. సాహిత్యం.. నృత్యం ఈ మూడు అంశాలే ఆయనకు బలం. కథలో కంటెంట్ ఉంటే ఈ సినిమా అయినా ప్రేక్షకుడు ఆదరిస్తాడు అని తన సినిమాలతో చూపించాడు. కేవలం కమర్షియల్ సినిమాలే రాజ్యమేలుతున్న వేళ ఆ ఒరవడిని పక్కన పెట్టి తన సినిమాలతో వహ్ వా అనిపించుకున్న దర్శకుడు కళా తపస్వి కె.విశ్వనాథ్. ఎన్నో మరుపురాని సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఘనత ఆయనది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన కళాఖండాల్లో ‘శంకరాభరణం’ సినిమా ఎప్పుడూ స్పెషలే. తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం ‘శంకరాభరణం’. ఈ సినిమా ఫిబ్రవరి 2 , 1980లో విడుదలై ప్రపంచ నలు మూలల్లో తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది. ఈ సినిమా ఇప్పటికి 40ఏళ్ళు పూర్తి చేసుకుంది. మరో 40 ఏళ్ళు పూర్తి చేసుకున్నా కూడా ఈ సినిమా స్థానం అలానే ఉంటుంది.

అయితే అంత సంచలనం సృష్టించిన ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ మీకు తెలుసా. అప్పట్లో కమర్షియల్ సినిమాలే కదా.. ఆ రుచికి ప్రజలు అలవాటు పడిపోయారు. దీనితో ఈ సినిమాను కొనడానికి కూడా ఎవరూ ముందుకు రాలేకపోయారు. సినిమా చూసి బాగుంది అని చెప్పడం.. లేకపోతే ఎవరైనా హీరోను పెట్టి తీస్తే అతని కోసమైనా కొనేవాళ్ళం అని చెప్పి వెళ్లిపోయారు తప్పా ఎవరూ సినిమాను కొనడానికి ధైర్యం చేయలేకపోయారట. అలా కేవలం ఒక్క థియేటర్ లో మాత్రం రిలీజ్ చేశారట. ఇక థియేటరే ఒకటి అయినప్పుడు ఆడియన్స్ మాత్రం ఎలా వుంటారు. నలుగురు ఆడియన్స్ మాత్రం చూశారట. ఇక అలా అలా టాక్ తో ఈ సినిమా అప్పట్లో ఒక ప్రభంజనమే సృష్టించింది. అప్పుడు సినిమా హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఎగపడ్డారట. ఇక కొన్ని వారాలు ఈ సినిమా థియేటర్లలో నిలిచింది.

ఇక సంగీతం ఈ సినిమాకు ప్రాణం. కె.వి. మహదేవన్ ప్రాణం పెట్టి ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాకు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం బెస్ట్ సింగర్‌గా తొలి సారి జాతీయ అవార్డు అందుకున్నాడు. వాణి జయరాంకు ఉత్తమ గాయకురాలిగా, కె.వి.మహదేవన్‌కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు దక్కాయి. స్వర్ణ కమలం అవార్డ్ అందుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే.

ఈ సినిమా ఘన విజయంలో కథ ఎంత కీలకమో శంకరశాస్త్రి గా చేసిన జేవీ సోమయాజులు నటన కూడా మరో కీలకం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తులసి ఇంకా మంజుభార్గవి, అల్లు రామలింగయ్య, చంద్రమోహన్, నిర్మలమ్మల నటన కూడా ‘శంకరాభరణం’ను ఓ కళాఖండంగా మార్చాయి.

కాగా విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు నిర్మించారు. కె.వి. మహదేవన్ సంగీతం అందించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =