సూపర్ హిట్ “నువ్వు నాకు నచ్చావ్ “మూవీ తో ఆర్తి అగర్వాల్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ హిట్ “నువ్వు లేక నేను లేను “, “ఇంద్ర “, “వసంతం “, “నేనున్నాను “, “అందాలరాముడు ” మూవీస్ తో ఆర్తి అగర్వాల్ ప్రేక్షకులను అలరించారు . టాలీవుడ్ స్టార్ హీరోస్ తో సూపర్ హిట్ మూవీస్ లో నటించిన ఆర్తి అగర్వాల్ బరువు తగ్గడానికి జరిగిన లైపో ఆపరేషన్ ఫెయిల్ అయ్యి చిన్న వయసు లోనే కన్ను మూశారు. ఇప్పుడు ఆర్తి అగర్వాల్ జీవిత చరిత్ర ఆధారంగా ఒక బయోపిక్ మూవీ రూపొందనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది . లెజండరీ యాక్టర్ , ఆంధ్ర ప్రదేశ్ దివంగత ముఖ్య మంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా “ఎన్టీఆర్ కథానాయకుడు” , “ఎన్టీఆర్ మహానాయకుడు ” మూవీస్ రూపొందిన విషయం తెలిసిందే. లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ “మహానటి ” మూవీ ఘనవిజయం సాధించింది. లెజెండరీ యాక్ట్రెస్ , పొలిటికల్ లీడర్ జయలలిత బయోపిక్ “తలైవి ” మూవీ రూపొందుతుంది. ఈ విధంగా పలు బయోపిక్ మూవీస్ హిందీ , తెలుగు ,తమిళ భాషలలో రూపుదిద్దుకుంటున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: