స్కూల్ కట్టిస్తున్న క్రియేటివ్ డైరెక్టర్..!

Creative Film Director Sukumar Builds School In His Native Village

సినిమాలే కాదు సేవా కార్యక్రమాలు చేయడంలోనూ మన టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎప్పుడూ ముందుంటారన్న సంగతి పలు సందర్భాల్లో ఇప్పటికే చూశాం. ఇక ఇప్పటికే ఎంతో మంది తమకు తోచిన విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే కొంతమంది చేసినవి బయటకొస్తే కొంతమంది చేసిన పనులు బయటకు రావు. ఇక ఇదిలా ఉండగా తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఒక స్కూల్ కట్టిస్తున్నారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అసలు సంగతేంటంటే… తన తండ్రిగారు అయిన బండ్రెడ్డి తిరుపతి రావు నాయుడు గారు పేరు మీద  మట్టపర్రు గ్రామంలో సుకుమార్ మండల ప్రజా పరిషత్ ప్రాధమిక ఉన్నత పాఠశాల ఆవరణలో రెండు అంతస్తుల పాఠశాల భవనం నిర్మాణం చేయుటకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. తన పెద్ద‌న్న‌య్య శ్రీ బండ్రెడ్డి వెంకటేశ్వర రావు పాఠ‌శాల భ‌వనానికి శంకుస్థాప‌న చేయగా.. భ‌వ‌నం ఖ‌ర్చు దాదాపు 14 ల‌క్ష‌ల రూపాయాలు అవుతుంద‌ని తెలుస్తుండ‌గా, ఆ ఖ‌ర్చంతా సుకుమార్ భ‌రిస్తాన‌ని చెప్పార‌ట‌. వీలైనంత త్వ‌ర‌గా పాఠ‌శాల భ‌వ‌నం పూర్తి చేయాల‌ని సుకుమార్ భావిస్తున్నారట.

కాగా సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. ఇవి కాకుండా..తను నిర్మాతగా మారి కొన్ని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఉప్పెన’ సినిమాను నిర్మించారు. కుమారి 21 ఎఫ్‍ ఫేమ్‍ పల్నాటి సూర్య ప్రతాప్‍ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ’18 పేజీస్’ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సుకుమార్ కథ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంకా వీటితో పాటు పలు సినిమాలను లైన్ లో పెడుతున్నాడు సుకుమార్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + eighteen =