ఆరు గెటప్స్ లో ఎన్టీఆర్

Jr NTR Will Be Seen In 6 Different Roles In Rajamouli Magnam Opus RRR

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ కథానాయకులు గా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీ స్టారర్, పీరియాడిక్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం “మూవీ 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. అలియా భట్ , ఒలీవియా కథానాయికలు కాగా అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ విజువల్స్ , గ్రాఫిక్స్ తో రూపొందుతున్న “రౌద్రం రణం రుధిరం “మూవీ లో ఎన్టీఆర్ కొమరం భీం , రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. కొమరం భీం పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ శత్రువులు తనను గుర్తుపట్టకుండా 6 గెటప్స్ లో కనిపించనున్నారని సమాచారం. ఈ ఆరు గెటప్స్ ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకుంటాయని చెప్పడం లో సందేహం లేదు. త్వరలోనే షూటింగ్ పునః ప్రారంభం కానున్న” RRR” మూవీ డబ్బింగ్ వెర్షన్స్ తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానున్నాయి. బ్లాక్ బస్టర్ “బాహుబలి ” తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఇద్దరు స్టార్ హీరోలతో రూపొందుతున్న ” RRR” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 14 =