ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ – బ్రదర్ అండ్ సిస్టర్ గా కాజల్- విష్ణు..!

Interesting Twist In Kajal Aggarwal & Manchu Vishnu's Mosagallu Movie

హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో మంచు విష్ణు కాజల్‌ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్‌ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు ఈ సినిమా చిత్రీకరణ 70 శాతం పూర్తయింది. ప్రస్తుతం కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విష్ణు, కాజల్‌ ఫస్ట్‌, సునీల్‌ శెట్టి ఫస్ట్‌ లుక్ పోస్టర్ లు రిలీజ్ చేయగా తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇటీవలే రిలీజ్ చేసిన కాజల్-విష్ణు అర్ధనారీశ్వరం రూపంలో ఉన్న పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ రోజు రాఖీ సందర్భంగా తన ట్విట్టర్ ద్వారా అనుకి అదే కాజల్ కి రాఖీ శుభాకాంక్షలు తెలిపాడు. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ ట్వీట్ తో ఈ సినిమాలో విష్ణు-కాజల్ బ్రదర్ అండ్ సిస్టర్ గా నటిస్తున్నారని అంటున్నారు. అంతేకాదు ఈ న్యూస్ ఒక ఫ్రెష్ కాంబినేషన్ ను చూడాలనుకుంటున్న ఫ్యాన్స్ కు కాస్త నిరాశపరిచేదే అని అంటున్నారు. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో.

కాగా ఇంకా ఈసినిమాలో సునీల్‌ శెట్టి కీలక పాత్రలో నటిస్తుండగా..నవదీప్‌, నవీన్‌ చంద్ర, రుహాని సింగ్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో విష్ణు అర్జున్ పాత్రలో నటిస్తుండగా.. కాజల్ అను పాత్రలో నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.