కరోనా పై ప్రశాంత్ వర్మ సినిమా – స్పెషల్ డే కి ఫస్ట్ లుక్..!

Prasanth Varma's New Movie First Look To Be Out On A Special Day

కరోనా నేపథ్యంలో ప్రశాంత్ వర్మ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ విషయం ఇప్పటికే ప్రకటించాడు కూడా. ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి.. ఇప్ప‌టికే 40 శాతం పూర్తి చేసుకున్న‌ట్టు తెలుస్తుంది‌. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కోసం ప్ర‌శాంత్ వ‌ర్మ కర్నూలులో ప్ర‌త్యేకంగా ఓ సెట్ ను కూడా వేశాడ‌ట‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అతని పుట్టినరోజు సందర్భంగా ప్రీ-లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఆగష్ట్ 15న స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఇక ఈ సినిమాకు దర్శకత్వం మాత్రమే కాదు తానే సొంతంగా నిర్మిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాలో నటించే నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు.

అ, క‌ల్కి వంటి చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించాడు యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. సినిమా సినిమాకు కొత్త‌ద‌నంతో కూడిన క‌థ‌ల‌ను ఎంచుకునే ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ సినిమాతో ఎలా మెప్పిస్తాడో చూద్దాం.

ఇక ఇదిలా ఉండగా మరోవైపు రామ్ గోపాల్ వర్మ కూడా కరోనాపై సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశాడు. మరి వీరిద్దరి సినిమాలో ఎవరి సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + six =