అభిషేక్ పిక్చర్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , విస్టా డ్రీమ్ మర్చంట్స్ బ్యానర్స్ పై శశి కిరణ్ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “గూఢచారి ” మూవీ 2018 సంవత్సరం ఆగస్ట్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. శోభిత ధూళిపాళ , మధుశాలిని , ప్రకాష్ రాజ్ , జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించిన ఈ మూవీ కి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. సక్సెస్ ఫుల్ “గూఢచారి ” మూవీ కి సీక్వెల్ “గూఢచారి 2” మూవీ రూపొందనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“గూఢచారి ” మూవీ ఈ రోజుతో 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా హీరో అడివి శేష్ చిత్ర యూనిట్ కు , అభిమానులకు ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు. “గూఢచారి ” మూవీ లో నటించడం తనకు నటుడిగా సంతృప్తినిచ్చిందని , తన సినీ జర్నీ లో సహకరించిన అందరికీ , ముఖ్యం గా అభిమానులకు థ్యాంక్స్ అంటూ అడివి శేష్ ట్వీట్ చేశారు. అడివి శేష్ ప్రస్తుతం తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతున్న “మేజర్ ” మూవీ లో నటిస్తున్నారు. ముంబై ఎటాక్స్ లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా “మేజర్ ” మూవీ రూపొందుతుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: