“వినాయకుడు “, “విలేజ్ లో వినాయకుడు ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కృష్ణుడు ఇప్పుడు నిర్మాతగా మారారు. నిత్యా క్రియేషన్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి ఒక మూవీ ని నిర్మించారు. ఒక కొత్త దర్శకుడి ని కృష్ణుడు టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు ఆ మూవీ విశేషాలు తెలుసుకుందాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిత్యా క్రియేషన్స్ బ్యానర్ పై లోతుగడ్డ జయరాం దర్శకత్వంలో ” మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ “మూవీ ని కృష్ణుడు నిర్మించారు. ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు ముగించుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణుడు మాట్లాడుతూ .. నేటితరం యువత భావాలకు అద్దం పట్టేలా కొత్త కథ , కథనాలతో ” మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ “మూవీ ని నిర్మించానని , నటుడు గా ప్రేక్షకులు తనను ఆదరించారని , నిర్మాత గా కొత్త ప్రయాణం ప్రారంభిస్తున్నానని , ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నానని, త్వరలోనే మిగతా వివరాలు వెల్లడిస్తానని కృష్ణుడు చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: