సాలిడ్ ఎంటర్ టైనర్ మూవీ

Gabbar Singh: A Cult Classic Entertainer With Universal Appeal.

పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన యాక్షన్ , కామెడీ మూవీ “గబ్బర్ సింగ్ ” రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శృతి హాసన్ కథానాయిక. “గబ్బర్ సింగ్ ” మూవీ లో పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. హీరో పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా నటించిన “గబ్బర్ సింగ్ ” మూవీ విశేష ప్రేక్షకాదరణ పొంది సుమారు 150 కోట్లు కలెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“గబ్బర్ సింగ్ ” మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బ్లాక్ బస్టర్ హిట్ “పిల్లా నువ్వు లేని జీవితం “సాంగ్ కు దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ అందించడం విశేషం. ఈ మూవీ కి పోలీస్ స్టేషన్ లో అంత్యాక్షరి సీన్ హైలైట్ గా నిలిచి నవ్వులు పండించి ప్రేక్షకులను అలరించింది. సాలిడ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన “గబ్బర్ సింగ్ ” మూవీ రిలీజ్ అయ్యి 8 సంవత్సరాలు అయినప్పటికీ ఆమూవీ పై ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. పవన్ కళ్యాణ్ సినీ జర్నీ లో ఒక మైలురాయి గా “గబ్బర్ సింగ్ ” మూవీ నిలిచింది. హీరో పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =