‘జీరో బడ్జెట్ గార్డెనింగ్’ టిప్స్ ఇస్తున్న సామ్..!

Samantha Akkineni Shares Zero Budget Gardening Tips

లాక్ డౌన్ లో రియల్ లైఫ్ లో సమంత ఎంత సింపుల్ గా ఉంటుందో తెలుస్తుంది. లాక్ డౌన్ లో ఉన్న ఖాళీ సమయాన్ని భర్త చైతన్య తో కలిసి ఎంజాయ్ చేస్తూనే మరో పక్క గార్డెనింగ్ చేస్తూ, కూరగాయలు పండిస్తూ కాలక్షేపం చేస్తుంది. అంతేకాదు ఇంటి టెర్రస్‌పై ఖాళీగా ఉన్న ప్రదేశంలో కూరగాయలు పండించింది. వాటికి సంబందించిన ఫొటోలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. అంతేకాదు ఎలా పెంచాలి.. దీనికోసం ఏమేం చేయాలి.. టెర్రస్ పై ఉన్న ఖాళీ స్థలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి.. కూరగాయలను ఎలా పండించాలి ఇలా పలు సూచనలు కూడా ఇచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి అర్బన్ ఫార్మింగ్ ఎలా చేసుకోవాలో చెపుతుంది. దానికోసం ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అర్బన్ ఫార్మర్ భార్గవి బిజ్జంతో తాను చేసిన సంభాషణకు సంబంధించి వీడియో పోస్ట్ చేస్తూ.. జీరో బడ్జెట్ గార్డెనింగ్.. ఎందుకు మరియు ఎలా..? భార్గవి బిజ్జంతో నా సంభాషణ.. తన జర్నీ..తనను ఇన్స్పైర్ చేసిన అంశాలు.. అర్బన్ ఫార్మింగ్ గురించి తాను నేర్చుకున్న విషయాలు, సలహాలు మీకోసం అని పేర్కొంది. ఇక ఈ వీడియోలో యంగర్ జనరేషన్ కు తెలుస్తుంది మన ఫుడ్ మనం పండించుకొని తింటే ఎంత బావుంటుందో అని అంటుంది సమంత. మరి మీరు కూడా ఒకసారి సమంత షేర్ చేసిన వీడియో చూసి.. ఆ టిప్స్ పాటించండి.

 

ప్రస్తుతం సామ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమాతోపాటు సామ్ ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. ఇందులో విలన్ పాత్ర చేస్తుంది సామ్. మరోవైపు ఇంకా గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − four =