ఎవరితో పోటీ లేదు – తమన్నా

We Do Not Compete With Each Other Says Actress Tamannaah Bhatia

తెలుగు , తమిళ , హిందీ చిత్రాలతో తమన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కొన్ని మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ తో తమన్నా ప్రేక్షకులను అలరిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను తమన్నా అభిమానులతో పంచుకుంటున్నారు. తమన్నా ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ ” మూవీలో కబడ్డీ కోచ్ గా నటిస్తున్నారు. ఒక హిందీ మూవీ లో కూడా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర పరిశ్రమలో పోటీ గురించి తమన్నా స్పందించారు. తమన్నా మాట్లాడుతూ .. ఏ చిత్ర పరిశ్రమలో నైనా చాలామంది ట్యాలెంటెడ్ కథానాయికలు వస్తూనే ఉంటారని , చిత్ర పరిశ్రమలో తనకు ఎవరితో పోటీ లేదని , ఎవరైనా తనకు పోటీ వస్తారనే ఆలోచనే తనకు ఉండదని , టాలీవుడ్ లో కాజల్ అగర్వాల్ , సమంత , అనుష్క అందరం స్నేహితులమే నని , మాలో ఎవరి సినిమా విజయం సాధించినా అందరం ఆస్వాదిస్తామని, పోటీ అనేదానికి మా మధ్య చోటే ఉండదని తమన్నా చెప్పారు. స్టార్ హీరోయిన్ తమన్నా నటించిన బాలీవుడ్ సూపర్ హిట్ “క్వీన్ ” మూవీ తెలుగు రీమేక్ “దటీజ్ మహాలక్ష్మీ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − twelve =