150 రోజులుగా ఇంట్లోనే..!

Malayalam Superstar Mammootty Makes An Interesting Revelation About His Son Dulqer Salmaan

లాక్ డౌన్ వల్ల సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా అందరూ ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఎంత సోషల్ డిస్టెన్స్ అయినా అన్ని రోజులు ఇంట్లోనే ఉండాలంటే చాలా మందికి కష్టమే. డబ్బున్న వారికి అంటే ఎలా అయినా సాగిపోతుంది కానీ పేద ప్రజలకు మాత్రం అలా కాదుగా.. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు ఎందరివో. ఇక సెలబ్రిటీస్ కూడా అప్పుడప్పుడు బయటకు వస్తున్నారనుకోండి. అయితే ఒక హీరో మాత్రం 150 రోజుల కాలు బయట పెట్టకుండా ఇంట్లోనే ఉన్నాడట. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా..? ఎవరో కాదు మలయాళం సీనియర్ హీరో మమ్ముట్టి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మ‌మ్ముట్టి 150 రోజుల‌పాటు ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాలేదట. ఈ విషయాన్ని స్వయంగా తనయుడు దుల్కర్ సల్మాన్ చెపుతున్నాడు. 150 రోజులుగా ఇంట్లోనే ఉన్నారని.. రోడ్ ట్రిప్ కు వెళ్దామ‌ని అడిగినా కూడా నో చెపుతున్నారట‌. అంతేకాదు తాను ఇలా ఎన్ని రోజులు ఇలా ఇంట్లో ఉండ‌గ‌లుగుతానో చూస్తాన‌ని ఛాలెంజ్ గా తీసుకున్న‌ట్టు చెప్పాడు. ఇప్పుడే కాదు ఆయ‌న ఇలా ప్ర‌తీసారి ఏదో ఒక ఛాలెంజ్ తీసుకుంటాడ‌ని చెపుతున్నాడు. మరి ఇన్నిరోజులు ఇంట్లో నుండి బయటకు రాలేదంటే గొప్ప విషయమే కదా. ఇక క్వారంటైన్ టైంలో త‌న హాబీ అయిన ఫొటోగ్ర‌ఫీపై దృష్టి పెడుతున్నాన‌ని మ‌మ్ముట్టి గ‌తంలో చెప్పిన విష‌యం తెలిసిందే.

గ‌తేడాది యాత్ర సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు మ‌మ్ముట్టి. ఈ సినిమాలో వైఎస్సార్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడు. ఇక దుల్కర్ ఇటీవలే కనులు కనులు దోచాయంటే సినిమాతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం తమిళ్ లో మలయాళంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇంకా తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో లెఫ్టినెంట్ రామ్ అనే సినిమాలోనటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాను అధికారకంగా ప్రకటన చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =