ఆర్ఆర్ఆర్ సినిమా మొదలైనప్పటి నుండి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ వినిపిస్తూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో పలు హైలైట్ సీన్స్ ఉంటాయని.. ఎన్టీఆర్ పలు గెటప్స్ లో కనిపించనున్నాడని.. బాహుబలి కంటే ఈ సినిమా పది రెట్లు గూజ్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని ఇలా ఎన్నో వార్తలు విన్నాం. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. అదేంటంటే ఈ సినిమాలో రాజమౌళి ఫ్రెండ్ షిప్ పై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఫ్రెండ్ షిప్ ను సాలిడ్ గా చూపించనున్నారట. అంతేకాదు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఫ్రెండ్ షిప్ పై ఒక స్పెషల్ సాంగ్ ను కూడా కంపోజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. మంచి ఆర్టిస్టిక్ విజువల్స్ తో ఈ పాట ఉండబోతుందట. మరి ఈ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయో లేదో తెలియాలంటే మాత్రం సినిమా వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా… ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా మొదలు పెట్టి కూడా దాదాపు రెండేళ్లు అవుతుంది. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక కొద్దిరోజుల్లో షూటింగ్ పూర్తవుతుందిలే అనుకున్నారు కానీ కరోనా వచ్చి పడటంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.
ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: