విలక్షణ నటుడు , కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మనోజ్ మంచు “దొంగ దొంగది ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. “దొంగ దొంగది ” మూవీ 2004 సంవత్సరం ఆగస్ట్ 6 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. “శ్రీ “, “నేను మీకు తెలుసా ?”, “బిందాస్ “, “వేదం “, కరెంట్ తీగ ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో మనోజ్ ప్రేక్షకులను అలరించారు. 3 సంవత్సరాలు గ్యాప్ తరువాత మనోజ్ “అహం బ్రహ్మస్మి ” మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




సూపర్ హిట్ “దొంగ దొంగది ” మూవీ తో పరిచయం అయిన మనోజ్ 16 సంవత్సరాల సినీ జర్నీ కంప్లీట్ చేసుకున్నారు. ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పేరుతో మనోజ్ ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పారు. ఎమ్ ఎమ్ ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో మనోజ్ మంచు హీరోగా భారీ బడ్జెట్ తో క్రైమ్ , కామెడీ , యాక్షన్ ఎంటర్ టైనర్ “అహం బ్రహ్మస్మి ” పాన్ ఇండియా మూవీరూపొందుతుంది . ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అహం బ్రహ్మస్మి ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని ఈ మూవీ పై ఆసక్తిని కలిగించింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























