10 వసంతాల “డాన్ శీను “

Mass Maharaja Ravi Teja Action Packed Love Entertainer Don Seenu Completes 10 Years.

ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజా హీరోగా రూపొందిన యాక్షన్ కామెడీ “డాన్ శీను ” మూవీ 2010 సంవత్సరం ఆగస్ట్ 6 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. గోపీచంద్ మలినేని దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన ఈ మూవీ లో శ్రియ కథానాయిక. 5సంవత్సరాల గ్యాప్ తరువాత శ్రియ “డాన్ శీను ” మూవీ లో నటించడం విశేషం. హీరో రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచింది. మణిశర్మ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన బ్లాక్ బస్టర్ “డాన్ ” మూవీ కై ఆకర్షితుడై రవితేజ తనను డాన్ శీను గా పిలిపించుకుంటూ , అమితాబ్ ను ఇమిటేట్ చేస్తూ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నారు. “డాన్ శీను ” మూవీ ఈ రోజు తో 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. సూపర్ హిట్ “డాన్ శీను ” మూవీ తరువాత గోపీచంద్ , రవితేజ కాంబినేషన్ లో రూపొందిన “బలుపు ” మూవీ ఘనవిజయం సాధించింది. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ “మూవీ రూపొందుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =