రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనితో అభిమానులు పవన్ సినిమా ఎప్పుడొస్తుందా.. ఎప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా కొద్దిరోజుల్లో వకీల్ సాబ్ సినిమా రాబోతుంది అనుకుంటుండగా ఈలోపు కరోనా రావడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ 80 శాతం పూర్తయింది. ఇంకా కొద్దిపాటి షూటింగ్ మాత్రమే ఉంది. ఇక ఆ పార్ట్ కూడా పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాతో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న విరూపాక్ష సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా హరీష్ శంకర్ తో కూడా పవన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజా సమాచారం ప్రకారం హరీష్ శంకర్, పవన్ కాంబినేషన్ లో రాబోయే సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. సొసైటీలో ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ఇష్యూస్ పై ఈ కథ వుండనున్నట్టు తెలుస్తుంది. అధికారిక సమాచారం అయితే లేదుకానీ ఈ వార్తలు మాత్రం జోరుగా వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేరుకోగా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు.
మరి వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన సంగతి తెలిసిందే. దీనితో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆ అంచనాలను రీచ్ అవుతారో లేదో తెలియాలంటే సినిమా వచ్చేంత వరకూ ఆగాల్సిందే.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























