లాక్ డౌన్ లో ఇంట్లో ఉన్న విజయ్ దేవకొండ ఫ్యామిలీతో టైంను స్పెండ్ చేస్తున్నాడు. అయితే సోషల్ మీడియా ద్వారా సినిమాతో పాటు పర్సనల్ విషయాలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లోనే ఉన్నాడు. ఈ లాక్ డౌన్ లో విజయ్ కు ముఖ్యంగా తన పెట్ డాగ్ తో ఎక్కువ సేపు ఆడుకునే టైమ్ దొరికింది. దానితో ఆడుకునే ఫొటోలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇటీవలే తలపై కుక్కని కూర్చోపెట్టుకొని బెడ్‌పై కుక్కతో ఫోటోకి ఫోజులిస్తూ తీసుకున్న ఫొటోలు పోస్ట్ చేయగా అవి అందర్నీ బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా మరో ఫొటో పోస్ట్ చేసాడు. తన పెట్ డాగ్ తో తీసుకున్న ఫొటో ను పోస్ట్ చేసి ‘మై క్యూట్ బీస్ట్’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఈ ఫొటోలో విజయ్ షర్ట్ లెస్ గా ఉండటం. బేర్ బాడీ తో ఉన్న ఈ ఫొటో అందర్నీ ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అతి తక్కువ కాలంలో విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ గా ఎదిగాడు. భయపడకుండా తను మాట్లాడే మాటలు.. చేతలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకుని యూత్‌లో మాంచి ఫాలోయింగ్ సంపాదించాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: