ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెలుగు ,తమిళ , హిందీ భాషలలో రూపొందిన “అరణ్య ” మూవీ ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ప్రముఖ పర్యావరణ వేత్త , గిరిజన రైతు జయదేవ్ పాయంగ్ జీవిత చరిత్ర ఆధారంగా “అరణ్య ” మూవీ రూపొందింది. అస్సాం రాష్ట్రం లోని నిరుపయోగ భూమిని 40సంవత్సరాలుగా మొక్కలు నాటి అడవిగా జయదేవ్ మార్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




“అరణ్య ” మూవీ హిందీ లో “హాథీ మేరే సాథీ “, తమిళ భాష లో “కాడన్ ” గా రూపొందింది. ఈ మూవీ లో జోయా హుస్సేన్ , శ్రియ పిల్ గోవాన్కర్ కథానాయికలు కాగా విష్ణు విశాల్ , పులకిత్ సామ్రాట్ ముఖ్య పాత్రలలో నటించారు. పాన్ ఇండియా “అరణ్య ” మూవీ లో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గిరిజన యువతి గా ఒక కీలక పాత్రలో నటించారని సమాచారం. కాజల్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య “, తెలుగు , ఇంగ్లీష్ భాషలలో రూపొందుతున్న “మోసగాళ్ళు “, “ఇండియన్ 2 “తమిళ మూవీ లో నటిస్తున్నారు. కాజల్ ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: