ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 72
కార్లు అమ్మడానికి కారణం అదే..!

చాక్లెట్ కేక్ , ఐస్ క్రీమ్ లు ఇష్టం - రష్మిక

కమల్ హాసన్ 61 ఇయర్స్ సినీ జర్నీ
గ్రీన్ చుడిదార్ లో సమంత

10 ప్యాక్ సాధిస్తా -నాగశౌర్య
రాజ్ పుత్ రాణి గెటప్ లో సాయి పల్లవి
నాని 'బైపోలార్ డిజార్డర్' అంతా అబద్దం

'FEAR' కి కొత్త అర్ధం చెపుతున్న 'శీను'
'మహేష్' ఛాలెంజ్ ను స్వీకరించిన 'విజయ్'
ఇలియానా '80 డేస్ ఛాలెంజ్'

రెజీనా స్విమ్మింగ్ సర్ ప్రైజ్

అంధురాలి పాత్రలో నయనతార
సమంత ట్రెండ్ సెట్టర్..!
డింపుల్ హయతి కి బాలీవుడ్ బిగ్ ఆఫర్
త్వరలో సెట్స్ పైకి నాగశౌర్య కొత్త సినిమా..!
సుబ్రహ్మణ్యపురం ఫేమ్ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి తో కలిసి నాగ శౌర్య 20 వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రీ లుక్, ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇంతకుముందు ఏ సినిమాలో కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపించనున్నట్టు తెలుస్తుంది నాగశౌర్య మేకోవర్ చూస్తుంటే. పురాతన క్రీడ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కతున్నట్టు తెలుస్తుంది.
కార్లు అమ్మడానికి కారణం అదే..!
రేణు దేశాయ్ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా రేణు దేశాయ్ ఆ తర్వాత మళ్ళీ పవన్ తో జానీ సినిమా చేశారు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత పవన్ ను పెళ్లి చేసుకుంది. అయితే ఇప్పుడు విడిపోయారనుకోండి. అది వేరే స్టోరీ. అయితే ఒక్క హీరోయిన్ మాత్రమే కాదు రేణు దేశాయ్ లో ఇంకా చాలా కోణాలే వున్నాయి. క్యాస్టూమ్ డిజైనర్ గా పనిచేశారు, డైరెక్టర్, రచయిత్రి మరి ఎన్నో కవితలు కూడా రాసింది. అంతేకాదు సామజిక సేవ చేయడంలో కూడా రేణు దేశాయ్ ముందుంటుంది. తనకు ఉన్నంతలో పలువురికి సాయం చేస్తుంటుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన కూతురు, కొడుకు విశేషాలను…

చాక్లెట్ కేక్ , ఐస్ క్రీమ్ లు ఇష్టం - రష్మిక
బ్లాక్ బస్టర్ "ఛలో " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కన్నడ హీరోయిన్ రష్మిక , పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కోలీవుడ్ లో కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న "పుష్ప " మూవీ లో కథానాయిక గా నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా నటించిన కన్నడ మూవీ "పొగరు "తెలుగు భాషలో కూడా రిలీజ్ కానుంది.

కమల్ హాసన్ 61 ఇయర్స్ సినీ జర్నీ
బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న సక్సెస్ ఫుల్ "కళత్తూర్ కన్నమ్మ " మూవీ లో బాల నటుడిగా కమల్ హాసన్ కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కమల్ హాసన్ రాష్ట్రపతి అవార్డ్ అందుకున్నారు. ఆ మూవీ 1960 సంవత్సరం ఆగస్ట్ 12 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. నేటితో కమల్ హాసన్ 61 ఇయర్స్ సినీ జర్నీ కంప్లీట్ చేసుకున్నారు. సూపర్ హిట్ "అపూర్వ రాగంగళ్" మూవీ కమల్ హాసన్ కు బ్రేక్ నిచ్చిన మూవీ. దక్షిణాది భాషలతోపాటు హిందీ , బెంగాలీ భాషలలో కమల్ హాసన్ సుమారు 220 మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు.
ఈ పరిస్థితిలో థియేటర్స్ ఓపెన్ చేస్తే వెళతారా? వెళ్ళరా?
2020 ఇలా ఉంటుందని ఎవరూ ఉహించనుకూడా ఉండరు. కరోనా వచ్చినా ఏదో రెండు మూడు నెలలు ఉంటుందేమో అని అనుకున్నారు కానీ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందనుకోలేదు. ఇక ఈ కరోనా వల్ల ఎన్నో పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సినీపరిశ్రమకు కొన్ని కోట్లలో నష్టం కలిగింది. షూటింగ్స్ ఎలాగూ లేవు.. కనీసం థియేటర్స్ అయినా ఓపెన్ అవుతాయా.. ఆ బిజినెస్ అన్నా జరుగుతుందా అంటే అదీ లేకుండా పోయింది.
గ్రీన్ చుడిదార్ లో సమంత
తెలుగు , తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు తెలుగు , తమిళ మూవీస్ కు సమంత బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్అందుకున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ "ఓ బేబీ " మూవీ తరువాత ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ పై ఆసక్తి చూపుతున్నారు. "ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 " వెబ్ సిరీస్ లో నటించిన సమంత ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

10 ప్యాక్ సాధిస్తా -నాగశౌర్య
బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న "చందమామ కథలు " మూవీ తో నాగశౌర్య టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ఊహలు గుస గుస లాడే ", "దిక్కులు చూడకు రామయ్య ", "కల్యాణ వైభోగమే ", "ఛలో ", "ఓ బేబీ " వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో నాగశౌర్య ప్రేక్షకులను అలరించారు. "అశ్వథ్థామ" మూవీ లో యాక్షన్ సీన్స్ లో నాగశౌర్య అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. హీరో నాగశౌర్య ప్రస్తుతం సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో విలువిద్య నేపథ్యంలో రూపొందున్న స్పోర్ట్స్ డ్రామా #NS20 మూవీ లో ఆర్చర్ గా నటిస్తున్నారు.
రాజ్ పుత్ రాణి గెటప్ లో సాయి పల్లవి
నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీతో సాయి పల్లవి తెలుగు చిత్ర పరిశ్రమ కు పరిచయం అయ్యారు. "ఫిదా " మూవీ లో తెలంగాణ యువతి భానుమతి గా సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఫిదా చేసి, బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. సాయి పల్లవి నటించిన తెలుగు , తమిళ , మలయాళ మూవీస్ ఘనవిజయం సాధించాయి. సాయి పల్లవి ప్రస్తుతం "లవ్ స్టోరీ ", "విరాటపర్వం " మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
నాని 'బైపోలార్ డిజార్డర్' అంతా అబద్దం
శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా "టక్ జగదీష్" సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆల్రెడీ సెట్స్ పైన ఉంది. కరోనా కనుక రాకపోయి ఉంటే ఈపాటికి షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యేది. కానీ ఆ పరిస్థితి లేదు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో నాని పాత్రపై కొద్దిరోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని బైపోలార్ డిజార్డర్‌తో బాధపడే కుర్రాడి పాత్రలో కనిపిస్తాడని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ రూమర్‌ను నాని టీమ్ కొట్టిపారేసింది. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తేల్చి.. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే.. ఎప్పటిలాగే నాని అదిరిపోయే ఎంటర్టైనింగ్ రోల్లో…

కంగారుపడొద్దు.. మెడికల్ ట్రీట్మెంట్ కోసం బ్రేక్..!
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు లంగ్ కాన్సర్ అన్నట్టు పలు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. శ్వాస సరిగ్గా ఆడట్లేదని ఇటీవల హాస్పిటల్ లో చేరగా కరోనా ఏమన్నా సోకిందేమో అన్న అనుమానంతో వైద్యులు కరోనా పరీక్షలు చేయగా.. అందులో కరోనా నెగిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే అదే సమయంలో జరిపిన పరీక్షల్లో ఆయనకు లంగ్ కాన్సర్ ఉన్నట్టు తేలిందట. ఈ నేపథ్యంలో చికిత్స కోసం అమెరికాకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే మరోపక్క సంజయ్ కు సీరియస్ గా ఉందని.. స్టేజ్ 4 అంటూ పలు వార్తలు కూడా వస్తున్నాయి.

'FEAR' కి కొత్త అర్ధం చెపుతున్న 'శీను'
విభిన్నమైన కథలతో తెలుగులో కూడా మంచి పేరును సంపాదించుకున్నాడు విజయ్ ఆంటోని. ప్రస్తుతం విజయ్ ఆంటోని అగ్ని సిరగుగల్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘జ్వాల’ పేరుతో విడుదల చేస్తున్న సంగతి కూడా విదితమే. నవీన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కమల్ హాసన్ తనయ అక్షర హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా నాజర్, ప్రకాష్ రాజ్, అరుణ్ విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగులో శర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై జవ్వాజి రామాంజనేయులు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.
'మహేష్' ఛాలెంజ్ ను స్వీకరించిన 'విజయ్'
సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. తన నివాసంలో మొక్కలు నాటి పచ్చని ప్రపంచం కోసం ఒక్క అడుగు ముందుకు వేద్దాం అంటూ మరో ముగ్గురు స్టార్లు జూనియర్ ఎన్టీఆర్, తమిళ స్టార్ హీరో విజయ్, నటి శృతిహాసన్‌లకు ఛాలెంజ్ విసిరారు. ఇక దీనిలో భాగంగా మహేష్ ఛాలెంజ్ ను స్వీకరించాడు విజయ్. ఈ నేపథ్యంలో చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటాడు విజయ్. మహేష్ ఇది నీకోసం... గ్రీనర్ ఇండియా.. గుడ్ హెల్త్ థ్యాంక్యూ అంటూ మొక్కలు నాటుతూ తన ఆ పోటోలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. మహేష్ విసిరినా ఛాలెంజ్ కు శృతి హాసన్ స్పందించి త్వరలో మొక్కలు నాటుతానని తెలిపింది.
ఇలియానా '80 డేస్ ఛాలెంజ్'
గోవా బ్యూటీ ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అని చెప్పనక్కర్లేదు. దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. పోకిరి సినిమాతో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగి అప్పట్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ ఇలియానా. తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించి చాలా కాలం పాటు టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. అయితే అప్పట్లో ఆండ్రూ నీబోన్ తో రిలేషన్ షిప్ లో ఉండి సినిమాలకు దూరమైంది. ఇప్పుడు బ్రేకప్ తర్వాత మళ్లీ సినిమాలపై ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు బ్రేకప్ అయిందనుకోండి. తన ప్రియుడితో విడిపోయినట్లు తానే తెలిపింది. ప్రస్తుతం సింగిల్ గానే వుంటూ మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది.

రెజీనా స్విమ్మింగ్ సర్ ప్రైజ్
15 సంవత్సరాలుగా తన అందం , అభినయం తో తెలుగు , తమిళ ప్రేక్షకులను అలరిస్తూ రెజీనా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను రెజీనా ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ "ఎవరు " మూవీ తో రెజీనా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రెజీనా ప్రధాన పాత్రలో రూపొందిన హారర్ తమిళ మూవీ "నెంజిల్ మరప్పదిల్లై " విడుదల కు సిద్ధంగా ఉంది. రెజీనా 4 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.

అంధురాలి పాత్రలో నయనతార
తెలుగు , తమిళ , మలయాళ భాషల ప్రేక్షకులను 17 సంవత్సరాలుగా అలరిస్తూ నయన తార సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నయనతార బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తో నయనతార ప్రేక్షకులను ఆకట్టుకుని లేడీ సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. నయనతార ప్రస్తుతం "నేత్రికన్ ", "మూకుత్తి అమ్మన్ ", 'అన్నా త్తే "తమిళ మూవీస్ లో నటిస్తున్నారు.
సమంత ట్రెండ్ సెట్టర్..!
టాలీవుడ్ హీరోయిన్లలో సమంత రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది కాలానికే.. లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక పెళ్లి తరువాత హీరోయిన్లకు పెద్దగా సినిమాలు రావు.. సక్సెస్ రేట్ కూడా తక్కువగానే ఉంటుంది.. కానీ అమ్మడు అదృష్టం ఏంటో కానీ పెళ్లి తరువాత కూడా అవకాశాలు తగ్గలేదు కదా.. వరుస హిట్లు కొట్టేస్తుంది. అందుకే ఇప్పుడు ఎంతో మందికి సమంత ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు.
డింపుల్ హయతి కి బాలీవుడ్ బిగ్ ఆఫర్
"గల్ఫ్ " మూవీ తో కథానాయిక గా టాలీవుడ్ కు పరిచయం అయిన డింపుల్ హయతి "అభినేత్రి 2 ", "యురేక" మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సూపర్ హిట్ "గద్దలకొండ గణేష్ " మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించి డింపుల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బ్లాక్ బస్టర్ "KGF చాప్టర్ 1" కన్నడ మూవీ కి డైలాగ్ రైటర్ గా పనిచేసిన చంద్రమౌళి దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందుతున్న కన్నడ మూవీ తో డింపుల్ కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. డింపుల్ ఇప్పుడు బాలీవుడ్ లో ఒక బిగ్ ఆఫర్ అందుకున్నారు.
నేషనల్ అవార్డ్ విన్నర్ దర్శకత్వంలో రాజశేఖర్ మూవీ ?
సూపర్ హిట్ "ప్రతిఘటన" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన Dr రాజశేఖర్ పలు మూవీస్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకులను అలరించారు. యాంగ్రీ యంగ్ మెన్ క్యారెక్టర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాజశేఖర్ హీరోగా రూపొందిన "ఆహుతి ", అంకుశం ", మగాడు ", "అల్లరి ప్రియుడు ", "అన్న", "గోరింటాకు "," PSV గరుడ వేగ" మూవీస్ ఘనవిజయం సాధించాయి.
'నిశ్శబ్దం' ..ఓటీటీ కావాలా? థియేటర్ లో కావాలా?
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం 'నిశ్శబ్దం'. నిజానికి ఈ సినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దానికితోడు ఈ కరోనా కూడా రావడంతో మరింత ఆలస్యం అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ పై ఇప్పటికే పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఓటీటీలోనే సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారని అన్నారు..అయితే దీనిపై స్పందించిన చిత్రయూనిట్ అదేం లేదు థియేటర్ లోనే సినిమాను రిలీజ్ చేస్తాం అని చెప్పారు.

స్పెషల్ సాంగ్ లో "రొమాంటిక్ "బ్యూటీ ?
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే మోడల్ , యాక్ట్రెస్ , సింగర్ కేతిక శర్మ "రొమాంటిక్ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే కేతిక శర్మ మరో మూవీ ఆఫర్ అందుకున్నారు. సంతోష్ జాగర్ల మూడి దర్శకత్వం లో నాగశౌర్య హీరోగా విలువిద్య నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా #NS20 మూవీ లో కేతిక శర్మ హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. కేతిక శర్మ ఇప్పుడు మరో మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కు ఎంపిక అయ్యారని సమాచారం.