
ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 71


నాగబాబు కామెడీ.. ఈరోజు నుండి నిహారిక నీ సమస్య..!
మలయాళం రీమేక్ లో రాజశేఖర్..?

'నిహారిక-చైతన్య' ల నిశ్చితార్థం
ప్రభాస్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ "వర్షం "

'గుడ్ లక్ సఖి' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

కాంబినేషన్ లో 'ప్రభాస్ 22'..?
స్టార్ హీరో శింబు కు జోడీగా శృతి హాసన్ ?
రామ్-సంతోష్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి..?
దర్శకుడు శైలేష్ కొలను అద్భుత ఆఫర్
టాలెంట్ ముఖ్యం - జాన్వీ కపూర్
నేడే నిశ్చితార్ధం..?

'RX100' తో కరోనాని తొక్కేయండి సర్
సంజయ్ భాయ్ మీరొక ఫైటర్
నివేద థామస్ మనసులో మాట
మహేష్ ఛాలెంజ్ పూర్తి చేసిన శ్రుతీహాసన్
హౌస్ వైఫ్ గా అనుష్క ఫస్ట్ ఆడిషన్ చూసారా..?

థియేటర్స్ లోనే "క్రాక్ " మూవీ రిలీజ్
సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరో గా నిజ జీవిత సంఘటనల ఆధారంగా యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , సముద్ర ఖని , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

నాగబాబు కామెడీ.. ఈరోజు నుండి నిహారిక నీ సమస్య..!
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థం నిన్న జరిగిన సంగతి తెలిసిందే. గుంటూరుకి చెందిన జొన్నలగడ్డ చైతన్యతో ఎంగేజ్మెంట్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిన్న సాయంత్రం నిరాడంబరంగా జరిగింది. కోవిడ్ నిబంధనలతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మెగా, అల్లు కుటుంబాలతోపాటు.. చైతన్య తరపు కొంతమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. నిహారిక నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

"ఇంద్రప్రస్థం " మూవీ పోస్టర్ రిలీజ్
"మహాప్రస్థానం "మూవీ తో సంచలనం సృష్టించిన దర్శకుడు దేవా కట్టా మరో సంచలనానికి తెర తీశారు. ప్రోడోస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దేవా కట్టా దర్శకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ పరిమాణాల నేపథ్యం లో "నైతికత మారుతుంది , అధికారం కోసం జరిగే పోరాటం ఎప్పుడు స్థిరం గా ఉంటుంది " అనే క్యాప్షన్ తో పొలిటికల్ డ్రామా " "ఇంద్రప్రస్థం " మూవీ తెరకెక్కుతుంది.
మలయాళం రీమేక్ లో రాజశేఖర్..?
గరుడవేగతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు రాజశేఖర్. ఆ సినిమా తర్వాత వచ్చిన కల్కి కూడా బాగానే ఆడింది. అయితే కల్కి తర్వాత ఇప్పటివరకూ కొత్త సినిమాను ప్రకటించలేదు రాజశేఖర్. అయితే ఆ మధ్య వీరభద్రమ్ దర్శకత్వంలో రాజశేఖర్ ఓ సినిమా చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి కానీ అందులో నిజం లేదని తెలిసింది. ఇక ఇటీవల నేషనల్ అవార్డ్ డైరెక్టర్ నీలకంఠతో సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

'నిహారిక-చైతన్య' ల నిశ్చితార్థం
ముందు నుండి అనుకున్నట్టుగానే 'నిహారిక-చైతన్య' ల నిశ్చితార్థం నిన్న రాత్రి జరిగింది. నిన్న రాత్రి 8 గంటలకు హైదరబాద్‌లో జరిగింది. ప్రభుత్వ నిబంధనలతో కేవలం కొద్దిమంది ఫ్యామిలీ సభ్యుల సమక్షంలో మాత్రమే ఈ నిశ్చితార్థ వేడుక నిరాడంబరంగా జరిగినట్టు తెలుస్తుంది.మెగా కుటుంబ సభ్యులతో పాటు..చైతన్య కుటుంబానికి చెందిన కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు అర్జున్, ఉపాసన, సురేఖ, శ్రీజ, సుస్మిత తదితరులు ఈ మెగా వేడుకలో సందడి చేశారు. నిహారిక బాబాయ్ పవన్ కళ్యాణ్ మాత్రం మిస్ అయ్యారు.
ప్రభాస్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ "వర్షం "
సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శోభన్ దర్శకత్వంలో ప్రభాస్ , త్రిష జంటగా రూపొందిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ "వర్షం "మూవీ 2004 సంవత్సరం జనవరి 14 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రభాస్ , త్రిష అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.ఈ మూవీ లో హీరో గోపీచంద్ ప్రతినాయకుడిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన లో అన్ని సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా "నువ్వొస్తానంటే "సాంగ్ ఇప్పటికీ తరచూ వినిపిస్తూనే ఉంటుంది.

'గుడ్ లక్ సఖి' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నగేష్ కుకునూర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గుడ్ లక్ సఖి. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అందులో కీర్తి సురేష్ గ్రామీణ ప్రాంత యువతిగా కనిపించిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఎప్పుడో విడుదలవ్వాల్సిన సినిమా కరోనా వల్ల ఆలస్యం అయింది.

కాంబినేషన్ లో 'ప్రభాస్ 22'..?
ఒక పక్క బాహుబలి సిరీస్.. సాహూ సినిమాలతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న హీరో ప్రభాస్.. మరోపక్క కె.జి.యఫ్ తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్.. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటది. ఆ ఊహే చాలా హై లో వుంది కదా. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటూ ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ కాంబోలో సినిమా రావడం గ్యారెంటీ అంటున్నాయి సినీ వర్గాలు. అంతేకాదు ఇప్పటికే కథ కూడా రెడీ అయ్యిందని అంటున్నారు. అయితే ఈ సినిమా రావడానికి లేట్ అవ్వొచ్చు…
స్టార్ హీరో శింబు కు జోడీగా శృతి హాసన్ ?
తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. మల్టీ టాలెంటెడ్ శృతి సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులతో తన జీవిత విశేషాలను పంచుకుంటున్నారు. శృతి ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ ", విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న "లాభం "(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు.
రామ్-సంతోష్ శ్రీనివాస్ ముచ్చటగా మూడోసారి..?
పలు సినిమాలకు కెమెరా మెన్ గా పనిచేసి 'కందిరీగ' సినిమాతో డైరెక్టర్ గా మారాడు సంతోష్ శ్రీనివాస్. ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా తీసిన ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీనే ఈ సినిమాకు ప్రధాన బలం. దానికి తగ్గట్టే ఈ సినిమాలో రామ్ తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో హైపర్ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా బాగానే ఆడింది. ఇక ఇప్పుడు ముచ్చట మూడోసారి కాంబినేషన్ రిపీట్ చేయనున్నట్టు తెలుస్తుంది.
దర్శకుడు శైలేష్ కొలను అద్భుత ఆఫర్
ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో ప్రవేశించడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. సోషల్ మీడియా లో ప్రతిభను చాటుకునేవారికి అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తున్నాయి. టాలెంట్ ఉండీ అవకాశాలు రాని వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారికి దర్శకుడు శైలేష్ కొలను అద్భుతమైన అవకాశం కల్పించారు. ఇంట్లోనే ఉండి ఆడిషన్స్ లో పాల్గొనవచ్చని, తమకు నచ్చిన సీన్ లో నటించిన వీడియో ను మెయిల్ చేయమని , ఒక వేళ షార్ట్ ఫిల్మ్ లో నటిస్తే ఆ వీడియోలు ఆడిషన్స్ @ శైలేష్ కొలను .కామ్ కు పంపించమని , పర్సనల్ గా వాటిని పరిశీలించి, తనకు నచ్చిన వారిని ఎంపిక చేసుకుంటానని శైలేష్ చెప్పారు.
టాలెంట్ ముఖ్యం - జాన్వీ కపూర్
లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సూపర్ హిట్ "ధడక్ " మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కార్గిల్ వార్ లో పాల్గొన్న మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవిత చరిత్ర ఆధారంగా జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన "గుంజన్ సక్సేనా :ది కార్గిల్ గర్ల్ " హిందీ మూవీ OTT ద్వారా నిన్న రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. గుంజన్ సక్సేనా పాత్రలో జాన్వీ కపూర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి స్టార్ హీరోలు హృతిక్ రోషన్ , సిద్ధార్ధ్ మల్హోత్రా ప్రశంసలు అందుకున్నారు.
నేడే నిశ్చితార్ధం..?
మెగా డాటర్ నిహారిక పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది కూడా. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లిచేసుకోబోతున్నారు. జొన్నలగడ్డ వెంకట చైతన్య హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ఇక ఇరువురు కుటుంబాలకు మంచి అనుబంధం ఉండటంతో ఈ పెళ్లి నిశ్చయించారు. ఇక చైతన్యతో తీసుకున్న ఫొటోలను అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంది నిహారిక. ఈ నేపథ్యంలో ఆగష్ట్ లో ఎంగేజ్ మెంట్ అని.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహం జరగనుందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
"జాంబీ రెడ్డి "టైటిల్ పై ప్రశాంత్ వర్మ ప్రెస్ నోట్
సక్సెస్ ఫుల్ సైకలాజికల్ థ్రిల్లర్ "అ !" మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ , ఆ మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 2 నేషనల్ అవార్డ్స్ అందుకున్న "అ !" మూవీ తరువాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "కల్కి " మూవీ నిరాశ పరచింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు నిజ జీవిత సంఘటనలతో "జాంబీ రెడ్డి" మూవీ తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన "జాంబీ రెడ్డి " మూవీ టైటిల్ లోగో కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది.

'RX100' తో కరోనాని తొక్కేయండి సర్
ఆర్ఎక్స్ 100 అజయ్ భూపతికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే ఈ రోజు తన ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. కరోనా వచ్చేసింది.. త్వరలోనే వస్తా.. ప్లాస్మా ఇస్తా అని ట్వీట్ లో తెలిపారు. ఇక ఈరోజు అజయ్ భూపతి పుట్టినరోజు కూడా. ఇక ఈ సందర్భంగా కార్తికేయ తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా అజయ్ కు కరోనా వచ్చిన నేపథ్యంలో దానిపై కూడా స్పందించాడు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుదామంటే కరోనా గురించి ట్వీట్ చేసేలా చేశారేంటి సర్. ఇందులో కూడా పాత్ బ్రేకింగ్ ఉన్నారు మీరు. ఏం పర్లేదు సర్.. కరోనాని ఆర్ఎక్స్ 100 తో తొక్కేసి వచ్చేయండి...హ్యాపీ బర్త్ డే సర్.. ఫాస్ట్ గా రికవర్…
సంజయ్ భాయ్ మీరొక ఫైటర్
సంజయ్ దత్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే కదా. గత కొద్దిరోజుల క్రితం ఊపిరి పీల్చుకోవడానికి బాగా ఇబ్బంది పడటంతో హాస్పిటల్ లో చేరగా అక్కడ సంజయ్ దత్ కు కరోనా పరీక్షలు చేశారు. అయితే కరోనా నెగిటివ్ వచ్చింది కానీ లంగ్ క్యాన్సర్ అని తేలింది. దీనితో త్వరలోనే ఆయన చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు. అంతేకాదు చికిత్స నిమిత్తం తాను షూటింగ్‌ల నుంచి విరామం తీసుకుంటున్నానని, అయితే తన అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని.. తన ఆరోగ్యంపై వచ్చే ఎలాంటి రూమర్స్ ను నమ్మవద్దని త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తానని ట్వీట్ కూడా చేశారు.
నివేద థామస్ మనసులో మాట
"వెరుతే ఒరు భార్య " మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు బాలనటి గా పరిచయం అయిన నివేద థామస్ , ఆ మూవీ కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కేరళ స్టేట్ అవార్డ్ ను అందుకున్నారు . సక్సెస్ ఫుల్ "ప్రయాణం "మూవీ లో నటించిన నివేద "పోరాలి " మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశించారు. సూపర్ హిట్ "జెంటిల్ మన్ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "నిన్నుకోరి", "జై లవకుశ ", "118 ", "బ్రోచేవారెవరురా " వంటి సూపర్ హిట్ మూవీస్ తో నివేద ప్రేక్షకులను అలరించారు.
మహేష్ ఛాలెంజ్ పూర్తి చేసిన శ్రుతీహాసన్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. సినీ ప్రముఖులు భారీ స్థాయిలో పాల్గొంటున్నారు. అంతేకాదు మన తెలుగులో స్టార్ట్ అయిన ఈ ఛాలెంజ్ చిన్న చిన్నగా పక్కన ఇండస్ట్రీకి కూడా వెళ్తుంది. తన పుట్టినరోజున గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు విజయ్, శ్రుతీ హాసన్, ఎన్టీఆర్ కు ఛాలెంజ్ విసరగా ఇప్పటికే విజయ్ మహేష్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటాడు. తాజాగా శ్రుతీహాసన్ కూడా మహేష్ ఛాలెంజ్ ను స్వీకరించింది. తాజాగా చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటింది.
కరోనా వచ్చేసింది అంటున్న ఆర్ఎక్స్ 100 డైరెక్టర్
కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీ మీద బాగా పడిందని చెప్పొచ్చు. షూటింగులు ఆగిపోయి.. ఏదో ఇంట్లో కూర్చొని చేసే పనులు కాదు కాబట్టి సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఇంటికే పరిమితమైపోయారు. హీరోలు, దర్శకులు ఇళ్ళల్లోనే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. నిజానికి షూటింగ్ లకు ప్రభుత్వం అనుమతులను ఇచ్చిన ఎవరూ షూటింగ్ చేయడానికి మాత్రం ముందుకు రావట్లేదు. ఏదో అక్కడక్కడ ఒకటీ రెండు సినిమాలు మాత్రమే షూటింగ్ ను ప్రారంభించాయి. ఇక ఇంట్లోనే ఉంటున్నా కరోనా మహమ్మారి మాత్రం వారిని వదలట్లేదు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీస్ కరోనా బారిన పడ్డారు. ఇక ఇప్పుడు తాజాగా మరో దర్శ కుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు…
హౌస్ వైఫ్ గా అనుష్క ఫస్ట్ ఆడిషన్ చూసారా..?
హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగాలంటే అంత ఈజీ కాదు. నిజానికి చెప్పాలంటే వారసులకు ఎంట్రీ దొరికినంత ఈజీగా బయట వాళ్లకు దొరకడం కష్టమే. మొదటి సినిమా అవకాశం రావాలంటే ఎంతో స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది. అలాంటిది మొదటి అవకాశం దక్కించుకొని... స్టార్ హీరోయిన్ రేంజ్ కు రావడం మాములు విషయం కాదు. ఎన్నో ఆడిషన్స్ ఇవ్వాలి.. ఫొటో షూట్ లు తీయాలి.. స్టూడియోల చుట్టూ తిరగాలి. అప్పుడు అదృష్టం కలిసొస్తే అవకాశాలు వస్తాయి. ఇక ఆ తర్వాత టాలెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇక అనుష్క ఫస్ట్ ఆడిషన్ వీడియో చూస్తేనే తెలుస్తుంది అనుష్క కూడా ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడి ఉంటుందో.