బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు లంగ్ కాన్సర్ అన్నట్టు పలు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. శ్వాస సరిగ్గా ఆడట్లేదని ఇటీవల హాస్పిటల్ లో చేరగా కరోనా ఏమన్నా సోకిందేమో అన్న అనుమానంతో వైద్యులు కరోనా పరీక్షలు చేయగా.. అందులో కరోనా నెగిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే అదే సమయంలో జరిపిన పరీక్షల్లో ఆయనకు లంగ్ కాన్సర్ ఉన్నట్టు తేలిందట. ఈ నేపథ్యంలో చికిత్స కోసం అమెరికాకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే మరోపక్క సంజయ్ కు సీరియస్ గా ఉందని.. స్టేజ్ 4 అంటూ పలు వార్తలు కూడా వస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ వార్తలపై సంజయ్ దత్ కూడా స్పందించి తన ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ” హాయ్ ఫ్రెండ్స్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం నా వర్క్ నుండి కొంచం బ్రేక్ తీసుకుంటున్నాను.. నా ఫ్యామిలీ, నా స్నేహితులు నాతోనే ఉన్నారు. ఈ సందర్భంగా నా సన్నిహితులకు చెప్పేది ఏంటంటే.. అనవసరమైన వార్తలకు కంగారు పడొద్దు.. మీ ప్రేమతో త్వరలోనే వస్తాను అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఆయన త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులుతో పాటు సిని ప్రముఖులు, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
— Sanjay Dutt (@duttsanjay) August 11, 2020
కాగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కె.జి.యఫ్ 2 లో సంజయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా కేజీఎఫ్ 2 మూవీ అధీర పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి కూడా విదితమే. ఇక అధీర లుక్‌కి భారీ స్పందన లభించింది. అంతేకాదు సంజయ్ దత్ నేరుగా ఓ సౌతిండియన్ మూవీలో నటించడం ఇదే తొలిసారి కావడంతో సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా దాదాపు ఇప్పటికే 90 శాతం షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. అసలే కరోనా వల్ల రిలీజ్ లేట్ అవుతుంది. ఇప్పుడు సంజయ్ దత్ ఆరోగ్య పరిస్థితి బాగోలేక పోవడంతో ఆయన కొన్నిరోజుల పాటు షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకోవాలి తప్పదు. మరి చూద్దాం ఇంకెంత లేట్ అవుతుందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: