సక్సెస్ ఫుల్ సైకలాజికల్ థ్రిల్లర్ “అ !” మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్ వర్మ , ఆ మూవీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 2 నేషనల్ అవార్డ్స్ అందుకున్న “అ !” మూవీ తరువాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “కల్కి ” మూవీ నిరాశ పరచింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు నిజ జీవిత సంఘటనలతో “జాంబీ రెడ్డి” మూవీ తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన “జాంబీ రెడ్డి ” మూవీ టైటిల్ లోగో కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొంత మంది “జాంబీ రెడ్డి ” మూవీ టైటిల్ ను తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని తెలియడంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ టైటిల్ పై వివరణనిచ్చారు. “జాంబీ రెడ్డి ” మూవీ టైటిల్ కు అద్భుత స్పందన వచ్చిందని , చాలా హ్యాపీగా ఉన్నామని , కొంతమంది ఆ టైటిల్ ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని , ఈ మూవీ లో ఎవరినీ , ఏ కులాన్నీ తక్కువ చేసి చూపించడం లేదని , “జాంబీ రెడ్డి ” ఒక ఎంటర్ టైనర్ మూవీ అని , కర్నూలు బ్యాక్ డ్రాప్ లో కరోనా నేపథ్యం లో ఈ మూవీ రూపొందుతుందని , కర్నూలు లో కరోనా వంటి మహమ్మారి ని ఎదిరించి , నిరోధించడం ప్రధానాంశం అని , దయచేసి టైటిల్ ను తప్పుగా ఊహించుకోవద్దని , ఈ మూవీ లో ఏ కులాన్నీ కించపరచమని , తన ఫస్ట్ ఫిల్మ్ “అ !” మూవీ కి జాతీయ స్థాయి లో గుర్తింపు వచ్చిందని , “జాంబీ రెడ్డి ” మూవీ కి అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు వస్తుందని నమ్ముతున్నానని ప్రశాంతవర్మ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: