హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదగాలంటే అంత ఈజీ కాదు. నిజానికి చెప్పాలంటే వారసులకు ఎంట్రీ దొరికినంత ఈజీగా బయట వాళ్లకు దొరకడం కష్టమే. మొదటి సినిమా అవకాశం రావాలంటే ఎంతో స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది. అలాంటిది మొదటి అవకాశం దక్కించుకొని… స్టార్ హీరోయిన్ రేంజ్ కు రావడం మాములు విషయం కాదు. ఎన్నో ఆడిషన్స్ ఇవ్వాలి.. ఫొటో షూట్ లు తీయాలి.. స్టూడియోల చుట్టూ తిరగాలి. అప్పుడు అదృష్టం కలిసొస్తే అవకాశాలు వస్తాయి. ఇక ఆ తర్వాత టాలెంట్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇక అనుష్క ఫస్ట్ ఆడిషన్ వీడియో చూస్తేనే తెలుస్తుంది అనుష్క కూడా ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడి ఉంటుందో.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ వీడియో చూస్తుంటే హౌస్ వైఫ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. అది కూడా హిందీలో.. హైద్రాబాదీ స్లాంగ్ లో. భార్య-భర్త ల మధ్య సంభాషణతో ఈ వీడియో ఉంటుంది. ఇందులో అనుష్క నేను కిచెన్ లో బిర్యాని వండాలి.. నాకు వంద చేతులు లేవు అన్ని పనులు చేయడానికి అంటూ తన భర్తతో ఫైట్ చేస్తుంది.. చూడటానికి ఈ వీడియో చాలా కామెడీ గా ఉంది. కానీ ఆడిషన్ అయినా అనుష్క నటన మాత్రం సూపర్. డౌటే లేదు అనుష్క ఈ రేంజ్ కు రావడానికి తన నటనే ఒక కారణమని. ఇంకెందుకు ఆలస్యం అనుష్క చేసిన ఫస్ట్ ఆడిషన్ మీరు కూడా చూసి నవ్వుకోండి.
2005 లో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనుష్క. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కి తారాస్థాయికి చేరుకుంది. ఎంతో మంది స్టార్ హీరోస్.. ఎంతోమంది టాప్ డైరెక్టర్స్ తో నటించింది. తనదైన అందం, అభినయంతో అభిమానులను మెస్మరైజ్ చేయడం అనుష్క స్పెషాలిటీ. దేవసేన, భాగమతి, జేజమ్మ ఈ పాత్రలు అనుష్క కోసమే పుట్టాయి. ఆ పాత్రల్లో వేరే వాళ్ళని ఊహించుకోవడం కష్టమే. స్టార్ హీరోలకు పోటీగా ఆమె కోసం పాత్రలు రాసే స్థాయికి ఎదిగింది. ఇక ఆమె పేరుకు తగ్గట్టే రియల్ లైఫ్ లో కూడా స్వీట్ గానే ఉంటుంది అనుష్క. ఇండస్ట్రీ పెద్దలకూ ఆమె స్వీటీనే. నటన,డ్యాన్స్ అనేవి తెలియకపోయినా ఈ స్థాయికి రావడం వచ్చిందంటే మరి మాములు విషయం కాదు.
ప్రస్తుతం అనుష్క హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ‘నిశ్శబ్దం’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈసినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: