నాగబాబు కామెడీ.. ఈరోజు నుండి నిహారిక నీ సమస్య..!

Mega Brother NagaBabu Pens An Emotional Tweet About Niharika Konidela On Twitter

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థం నిన్న జరిగిన సంగతి తెలిసిందే. గుంటూరుకి చెందిన జొన్నలగడ్డ చైతన్యతో ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం హైదరాబాద్‌లో నిన్న సాయంత్రం నిరాడంబరంగా జరిగింది. కోవిడ్ నిబంధనలతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మెగా, అల్లు కుటుంబాలతోపాటు.. చైతన్య తరపు కొంతమంది బంధువులు మాత్రమే హాజరయ్యారు. నిహారిక నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు నాగబాబు నిహారికకు ఉద్దేశించి చేసిన ట్వీట్ నెటిజన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే… `డియర్‌ చై.. దాదాపు చాలా విషయాల్లో నిహారిక నాలాగే ఉంటుందని అంతా అంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమనంతా తనపై కురిపిస్తావని నమ్ముతున్నాను. ఇక, ఈ రోజు నుంచి ఆమె నీ ప్రాబ్లెమ్` అని కామెడీగా ట్వీట్ చేశారు.

 


మెగా ఇంట అల్లుడిగా అడుగుపెట్టబోతున్న జొన్నలగడ్డ చైతన్య.. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు. మెగా ఫ్యామిలీతో ఈ కుటుంబానికి ఎప్పటి నుంచో పరిచయం ఉందట. ఇండియన్ స్కూల్ బిజినెస్‌లో ఎంబీఏ పూర్తిచేసిన చైతన్య ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ఎంఎన్‌సి కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు.

ఇక పెళ్లి వచ్చే ఏడాది అంటున్నారు. మరి అప్పటివరకూ ఉంటారో.. ప్రస్తుతం పరిస్థితులు బాలేవు కాబట్టి తొందరగానే కానిచ్చేస్తారేమో చూద్దాం ఎం జరుగుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =