కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీ మీద బాగా పడిందని చెప్పొచ్చు. షూటింగులు ఆగిపోయి.. ఏదో ఇంట్లో కూర్చొని చేసే పనులు కాదు కాబట్టి సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఇంటికే పరిమితమైపోయారు. హీరోలు, దర్శకులు ఇళ్ళల్లోనే ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. నిజానికి షూటింగ్ లకు ప్రభుత్వం అనుమతులను ఇచ్చిన ఎవరూ షూటింగ్ చేయడానికి మాత్రం ముందుకు రావట్లేదు. ఏదో అక్కడక్కడ ఒకటీ రెండు సినిమాలు మాత్రమే షూటింగ్ ను ప్రారంభించాయి. ఇక ఇంట్లోనే ఉంటున్నా కరోనా మహమ్మారి మాత్రం వారిని వదలట్లేదు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీస్ కరోనా బారిన పడ్డారు. ఇక ఇప్పుడు తాజాగా మరో దర్శ కుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. ఆర్‌ఎక్స్ 100తో టాలీవుడ్‌కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తనకు కూడా కరోనా పాజిటివ్ వచ్చేసిందని.. త్వరలోనే వస్తా .. ప్లాస్మా దానం చేస్తానని ట్వీట్ లో పేర్కొన్నాడు.
Vachesindi
— Ajay Bhupathi (@DirAjayBhupathi) August 12, 2020
త్వరలో వస్తా..
ప్లాస్మా ఇస్తా…— Ajay Bhupathi (@DirAjayBhupathi) August 12, 2020
ఆర్ఎక్స్ 100 లాంటి కల్ట్ అండ్ బోల్డ్ కంటెంట్ తో సినిమా తీసి మంచి కమర్షియల్ హిట్ కొట్టాడు అజయ్ భూపతి. ప్రస్తుతం మహాసముద్రం అనే సినిమా చేస్తున్నాడు. శర్వానంద్, సిద్ధార్థ్‌లు హీరోలుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో సాయి పల్లవి సైతం నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: