‘నిహారిక-చైతన్య’ ల నిశ్చితార్థం

Niharika & Chaitanya Get Engaged

ముందు నుండి అనుకున్నట్టుగానే ‘నిహారిక-చైతన్య’ ల నిశ్చితార్థం నిన్న రాత్రి జరిగింది. నిన్న రాత్రి 8 గంటలకు హైదరబాద్‌లో జరిగింది. ప్రభుత్వ నిబంధనలతో కేవలం కొద్దిమంది ఫ్యామిలీ సభ్యుల సమక్షంలో మాత్రమే ఈ నిశ్చితార్థ వేడుక నిరాడంబరంగా జరిగినట్టు తెలుస్తుంది.మెగా కుటుంబ సభ్యులతో పాటు..చైతన్య కుటుంబానికి చెందిన కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు అర్జున్, ఉపాసన, సురేఖ, శ్రీజ, సుస్మిత తదితరులు ఈ మెగా వేడుకలో సందడి చేశారు. నిహారిక బాబాయ్ పవన్ కళ్యాణ్ మాత్రం మిస్ అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ కూడా తన చెల్లి ఎంగేజ్ మెంట్ అయిందని చెపుతూ.. తన బావకి తమ కుటుంబంలోకి వెల్ కమ్ చెప్పాడు.

 

మెగా ఫ్యామిలీకి అల్లుడుగా రాబోతున్న జొన్నల గడ్డ చైతన్య గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు. చైతన్య కుటుంబంతో మెగా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో పరిచయం ఉండటం.. చిరంజీవి తండ్రి కొణిదెల వెంకటరావు, చైతన్య తాతయ్య గుణ వెంకటరత్నం ప్రాణ స్నేహితులు కావడంతో ఈ సంబంధం సెట్ అయినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఓ ఎంఎన్‌సీ కంపెనీలో ఉన్నత పదవిలో చైతన్య ఉన్నట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం తమిళ్ లో ఒక సినిమా చేస్తుంది నిహారిక. గతంలో ‘ఒరు నల్ల నాళ్‌ పాత్తు సొల్రేన్‌’ (2018) సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది నిహారిక కొణిదెల. ఇప్పుడు తాజాగా ఓ మై కడువలె సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తమిళ యంగ్ హీరో అశోక్ సెల్వన్ తో ఆమె నటించనుంది. పూర్తి స్థాయి కామెడీతో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తుంది. దీనితోపాటు ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు కూడా నిహారిక సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టును మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత నిర్మించనున్నట్లు తెలుస్తోంది. మరి పెళ్ళైన తర్వాత నిహారిక సినిమాలు చేస్తుందో లేదో చూడాలి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 4 =