ఒక పక్క బాహుబలి సిరీస్.. సాహూ సినిమాలతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న హీరో ప్రభాస్.. మరోపక్క కె.జి.యఫ్ తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్.. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటది. ఆ ఊహే చాలా హై లో వుంది కదా. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటూ ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ కాంబోలో సినిమా రావడం గ్యారెంటీ అంటున్నాయి సినీ వర్గాలు. అంతేకాదు ఇప్పటికే కథ కూడా రెడీ అయ్యిందని అంటున్నారు. అయితే ఈ సినిమా రావడానికి లేట్ అవ్వొచ్చు కానీ రావడం మాత్రం పక్కా అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ప్రభాస్, జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నాడు ఈ రెండు సినిమాలు అవ్వాలంటే టైం పడుతుంది. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా కనిపించనుంది. మరోవైపు కె.జి.యఫ్ 2 సినిమాతో బిజీ గా వున్నాడు. ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా కూడా షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ అవ్వాలంటే వచ్చే ఏడాది అవుతుంది. ఆ తరువాత ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. దీనితో ప్రశాంత్ నీల్-ప్రభాస్ సినిమా 2022 లో పట్టాలెక్కనున్నదని అంటున్నారు. చూద్దాం మరి అప్పటికి పరిస్థితులు ఎలా వుంటాయో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: