కరోనా మహమ్మారి కారణం గా లాక్ డౌన్ లో మూవీ రిలీజ్ లు ఆగిపోయి , థియేటర్స్ మూతబడి , షూటింగ్స్ నిలిచిపోయి చిత్ర పరిశ్రమ పలు నష్టాలకు గురి అయిన విషయం తెలిసిందే. సినిమా , టీవీ ఇండస్ట్రీస్ కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. షూటింగ్ సమయం లో పాటించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర సమాచార , ప్రచార శాఖా మంత్రి జవదేకర్ ఆదివారం వెల్లడించారు. కరోనా నేపథ్యంలో మార్గ దర్శకా లను పాటిస్తూ షూటింగ్స్ జరుపుకోవచ్చని , షూటింగ్స్ ప్రారంభం కావడంతో అనేక మందికి ఉపాధి లభిస్తుందనే ఆశాభావం ఆయన వ్యక్తంచేశారు .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
షూటింగ్ సమయం లో పాటించవల్సిన మార్గదర్శకాలు :
1. COVID-19 నిబంధనలు పాటించడం
2. సోషల్ డిస్టెన్స్
3. ఆరోగ్య సేతు యాప్
4. తక్కువ టీమ్ మెంబర్స్
5. PPE కిట్స్ ధరించడం
6. ఫేస్ మాస్క్ లు , ఫేస్ షీల్డ్స్
7. షూటింగ్ సెట్ ను శానిటైజ్ చేయడం
8. థర్మల్ స్కానింగ్,
9. థియేటర్స్ లో సీటింగ్ ఏర్పాటు
10. ఆన్ లైన్ ద్వారా టికెట్స్ అమ్మకం
థియేటర్ లో సీట్స్ ఏర్పాటు గురించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పేర్కొనడం తో త్వరలో థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: