కింగ్ నాగార్జున బర్త్ డే సీడీపీ రిలీజ్

Actress Samantha Akkineni Releases Common Display Picture Of Akkineni Nagarjuna

లెజెండరీ యాక్టర్ , నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున సక్సెస్ ఫుల్ “విక్రమ్ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ , హిందీ భాషలలో సుమారు 100 సినిమాలతో మూడున్నర దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. బెస్ట్ యాక్టర్ గా 1 నేషనల్ , 9 నంది , 3 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ నాగార్జున అందుకున్నారు. “గీతాంజలి “, “శివ “, “హలో బ్రదర్ “, “క్రిమినల్ “, “నిన్నే పెళ్ళాడుతా “, “అన్నమయ్య “, ” నేనున్నాను “, “సోగ్గాడే చిన్ని నాయనా ” వంటి సూపర్ హిట్ మూవీస్ నాగార్జున సినీ కెరీర్ లో మైలు రాళ్ళు గా నిలిచాయి. నాగార్జున ప్రస్తుతం “వైల్డ్ డాగ్ “, “బ్రహ్మాస్త్ర “(హిందీ ) మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆగష్టు 29 వ తేదీ నాగార్జున తన బర్త్ డే ను జరుపుకోనున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో హీరోల బర్త్ డే సీడీపీ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. నాగార్జున బర్త్ డే సందర్భంగా నాగార్జున కోడలు సమంత బర్త్ డే సీడీపీ ని తయారు చేయించి రిలీజ్ చేశారు. నాగార్జున నటించిన పలు మూవీస్ స్టిల్స్ తో ఈ సీడీపీ రూపొందింది. ఈ సీడీపీ ని రిలీజ్ చేయడం తనకు దక్కిన గౌరవం అని , అయన పై తనకు ఎంతో ప్రేమ , గౌరవం ఉన్నాయని , అవి ఎప్పటికీ నిలిచే ఉంటాయని సమంత చెప్పారు. నాగార్జున అభిమానులు ఆ సీడీపీ ని సోషల్ మీడియా లో ట్రెండ్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 10 =