ఈవారం మెను మొత్తం ‘క్యారెట్స్’ అంటున్న సామ్

Actress Samantha Akkineni Plans Her Entire Week Menu With Carrots From Her Home Garden

మాఇంట్లో ఈవారం మొత్తం మెను క్యారెట్స్ అంటుంది సమంత. మరి అందుకు కారణం ఏంటో తెలుసుకోవాలంటే అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే. లాక్ డౌన్ లో దొరికిన ఈ టైంను సామ్ చాలా బాగా ఉపయోగించుకుంటుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా అర్బన్ ఫార్మింగ్ చేస్తూ ఇంట్లోనే చక్కగా సేంద్రియ పద్దతి ద్వారా కూరగాయలు పెంచుతూ.. తనకు కావాల్సిన కాయకూరల్ని తానే స్వయంగా పండించుకుంటుంది. అంతేకాదు తనలాగే అందరూ ఇంట్లోనే కూరగాయలు పెంచుకోమని.. దానికి సంబంధించి టిప్స్ కూడా చెపుతుంది. వాటికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా సమంత తన ఇంటిపై క్యారెట్‌లను చూపిస్తూ.. ఈ వారమంతా క్యారెట్‌తోనే వంటలు చేయబోతున్నా అని తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. ఈ వారం మెను.. క్యారెట్ జ్యూస్, క్యారెట్ పచ్చడి, క్యారెట్ హల్వా, క్యారెట్ వేపుడు, క్యారెట్ పకోడి, క్యారెట్ ఇడ్లీ, క్యారెట్ సమోసా` అని పోస్ట్ చేసింది. మొత్తానికి ఈ వారం మొత్తం చైతు క్యారెట్టే తినాలన్నమాట.

 

 

View this post on Instagram

 

The menu this week … Carrot juice , carrot pachadi , carrot halwa , carrot fry , carrot pakodi , carrot idli , carrot samosa 🤓 #growwithme

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

మరోవైపు గ్రో విత్ మీ ఛాలెంజ్ కు సామ్ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఈ ఛాలెంజ్‌కు ముందుగా ఆమె మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్‌లను నామినేట్ చేశారు. ఇక ఛాలెంజ్ ను స్వీకరించిన రకుల్, మంచు లక్ష్మీ తమ ఛాలెంజ్ లను పూర్తి చేసారు.

ప్రస్తుతం సామ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమాతోపాటు సామ్ ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది. ఇందులో విలన్ పాత్ర చేస్తుంది సామ్. మరోవైపు ఇంకా గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 10 =