ప్రస్తుతం వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ వెబ్ సిరీస్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. సమంత , కాజల్ అగర్వాల్ , తమన్నా , అంజలి తోపాటు రాశీఖన్నాకూడా వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ , కోలీవుడ్ లలో రాశీఖన్నా సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. షూటింగ్స్ ప్రారంభం కాకపోవడంతో ఇంటికి పరిమితం అయిన రాశీఖన్నా సోషల్ మీడియా లో ఫోటోలు షేర్ చేస్తూ , తమిళ భాషను ప్రాక్టీస్ చేస్తూ , గిటార్ సాధన చేస్తూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వెబ్ సిరీస్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్న రాశీఖన్నా మాట్లాడుతూ … ఒక వెబ్ సిరీస్ ఐడియా తనకు నచ్చిందనీ , ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుందనీ, ఆ వెబ్ సిరీస్ లో నటించడానికి ఆసక్తి తో ఎదురు చూస్తున్నాననీ చెప్పారు. రాశీఖన్నా తన మూవీస్ గురించి మాట్లాడుతూ .. 2 తెలుగు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాననీ , ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆ మూవీస్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని, ఆ మూవీస్ నిర్మాణ సంస్థలే అనౌన్స్ చేస్తే బాగుంటుందని రాశీఖన్నా చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: