“KGF చాప్టర్ 2 ” మూవీ అప్ డేట్

KGF Chapter 2 Movie Team Releases An Interesting Update.

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ మూవీ “KGF చాప్టర్ 1” కన్నడ మూవీ ఘనవిజయం సాధించింది. రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. అదే టీమ్ తో
ఆ మూవీ సీక్వెల్ “KGF చాప్టర్ 2 ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

90 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న “KGF చాప్టర్ 2 ” మూవీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. చిత్ర నిర్మాతలలో ఒకరైన కార్తీక్ మాట్లాడుతూ .. “KGF చాప్టర్ 2 ” మూవీ షూటింగ్ ఆగస్ట్ 26 వ తేదీ నుండి పునః ప్రారంభం కానుందని తెలిపారు. స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ తో షూటింగ్ ప్రారంభిస్తున్నామని , టీమ్ మెంబెర్స్ ను ఒక హోటల్ లో ఉంచి , షూటింగ్ కంప్లీట్ అయ్యేంతవరకూ అక్కడే ఉండేలా ప్లాన్ చేశామని , షూటింగ్ బ్యాలెన్స్ పార్ట్ ను కంప్లీట్ చేస్తామని తెలిపారు. హీరో యష్ మాట్లాడుతూ .. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని , ఫస్ట్ పార్ట్ ను ఆదరించిన ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా “KGF చాప్టర్ 2 ” మూవీ రూపొందుతుందని చెప్పారు. ఈ మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + two =