బాలీవుడ్ అందాల తార ఊర్వశి రౌటేలా టాలీవుడ్ లోకి ‘బ్లాక్ రోస్’ అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సంపత్ నంది స్నేహితుడు మోహన్ భరద్వాజ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఊర్వశి రూటేలా లీడ్ రోల్ లో నటిస్తోంది.ఇక ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టేసారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. ఓకే షెడ్యూల్ లో సినిమా పూర్తి చేయాలని చిత్రయూనిట్ ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో తెరెకెక్కించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఊర్వశి ఇదే తనకు తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి పర్ఫెక్ట్ డెబ్యూ అంటుంది. బ్లాక్ రోజ్ బైలింగ్వల్ సినిమా.. తెలుగు, హిందీలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఇది నాకు డెబ్యూ ఫిలిం.. సంపంత్ నంది మంచి గుర్తింపు ఉన్న ఫిలింమేకర్ అని నాకు తెలుసు.. నన్ను మైండ్ లో పెట్టుకొనే ఆయన స్క్రిప్ట్ రాసినట్టున్నారు.. ఈ సినిమా కోసం నన్ను అడిగినప్పుడు నేను చాలా ఎగ్జైట్, థ్రిల్ ఫీల్ అయ్యాను.. నాకు ఎలాంటి భాషా బేధం లేదు..ఏ లాంగ్వేజ్ లో అయినా సినిమాలు చేయడానికి నేను రెడీ అని తెలిపింది. విలియం షేక్స్ పియర్స్ రాసిన మర్చంట్ ఆఫ్ వెనిస్ అనే కథలోని షైలాక్ పాత్ర ఆధారంగా నా పాత్ర ఉంటుంది బ్లాక్ రోజ్ సినిమాలో.. కౌటిల్య అర్థశాస్త్ర బేస్ చేసుకొని కూడా ఉంటుంది. నా యాక్టింగ్ ఎబిలిటీస్ చూపించుకోడానికి ఇదే పర్ఫెక్ట్ డెబ్యూ అని తెలిపింది.
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: