సందీప్ రెడ్డి డైరెక్టర్ గా విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ జనరేషన్ లో ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండను స్టార్ హీరోను చేసిన సినిమా ‘అర్జున్ రెడ్డి. ఆ చిత్రంతోనే హీరో విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. ఇక ఆ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఇక తెలుగులో సంచలన విజయం సాధించిన ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. హిందీలో కూడా సందీప్ వంగానే డైరెక్ట్ చేయగా..షాహిద్ కపూర్ హీరోగా రూపొందిన ఆ సినిమా సంచలన విజయం సాధించింది. అంతేకాదు షాహిద్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. తమిళ్ లో కూడా మంచి విజయం దక్కింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ కాంబినేషన్ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈ సారి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చేది సినిమా కాదు. అసలు సంగతేంటంటే.. ‘కింగ్ ఆఫ్ ద హిల్’ బ్యానర్ పై విజయ్ దేవరకొండ నిర్మించే వెబ్ సీరీస్ కి సందీప్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. ఇందులో విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ లీడ్ రోల్ పోషిస్తాడట. ప్రస్తుతం ఈ వార్త చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
విజయ్ దేవరకొండ తక్కువ కాలంలోనే భారీ స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు. హీరోగానే కాకుండా సొంత ప్రొడక్షన్ ను ఏర్పాటు చేసి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే తరుణ్ భాస్కర్ హీరోగా ఒక సినిమా చేసాడు. కొత్తవారికి.. యంగ్ టాలెంట్ ను తన బ్యానర్ ద్వారా ప్రోత్సహించనున్నాడు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: