సామ్ ‘గ్రో విత్ మీ’ ఛాలెంజ్ పూర్తి చేసిన రకుల్

Rakul Preet Accepts Samantha's Challenge

‘గ్రో విత్ మీ’ ఛాలెంజ్.. సమంత కొత్తగా ముందుకు తీసుకొచ్చిన ఛాలెంజ్. లాక్ డౌన్ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కోరకంగా వాడుకుంటున్నారు. అయితే ఈ లాక్ డౌన్ స‌మ‌యాన్ని క‌రెక్ట్‌గా వినియోగించుకుంటున్న వారిలో స‌మంత కూడా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే స‌మంత అర్బన్‌ వ్యవసాయానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ లోని తన నివాసంలోని టెర్రస్‌పై ఉన్న ఖాళీ ప్లేస్లో సేంద్రీయ పద్దతుల్లో కూరగాయల్ని పండిస్తోంది. ఇక తాను మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఇలానే కాయకూరల్ని పండించుకొని తినాలని కూడా పిలునిస్తుంది. అంతేనా కావాల్సిన టిప్స్ కూడా చెపుతుంది సామ్. ఇక ఈ ఆలోచనలో భాగంగానే వచ్చిందే ‘ ‘గ్రో విత్ మీ’ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్‌కు ముందుగా ఆమె మంచు ల‌క్ష్మీ, ర‌కుల్ ప్రీత్ సింగ్‌ల‌ను నామినేట్‌చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సమంత ఛాలెంజ్ ను స్వీకరించిన రకుల్ ఛాలెంజ్ ను పూర్తి చేసింది. దీనికి సంబంధించి వీడియోను కూడా తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. తనను ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేసినందుకు సమంతకు థ్యాంక్స్ చెపుతూ.. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బావుందని.. అంతేకాదు తాను ఏయే కాయగూర‌ల‌ను పండిస్తుందో కూడా ర‌కుల్ వివ‌రించారు. ఇక లక్ష్మీ మంచు కూడా ఛాలెంజ్ ను స్వీకరించి పూర్తి చేసినట్టు తెలుస్తుంది.

 

మరి ఇప్పటి వరకూ ఎన్నో ఛాలెంజ్ లు చాలా ప్రాచూర్యం పొందాయి. కొన్ని ఛాలెంజ్ ల వల్ల ఉపయోగం ఉన్నా.. కొన్ని ఛాలెంజ్ ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నది తెలిసిందే. కానీ సామ్ చేపట్టిన ‘గ్రో విత్ మీ’ ఛాలెంజ్ ఎంతో ఉపయోగపడే ఛాలెంజ్ మాత్రమే కాకుండా ఆరోగ్యానికి, పర్యావరణానికి కూడా చాలా ఉపయోగపుతుంది. ఇలాంటి ఛాలెంజ్ ను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా వుంది.

ఇక రకుల్ సినిమా విషయాలకొస్తే తెలుగులో నితిన్ సరసన చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో నటిస్తుంది రకుల్. హిందీలో జాన్ అబ్రహాం “అటాక్ “, అర్జున్ కపూర్ ” ఛలే ఛలో ” మూవీస్ లో నటిస్తుంది. ఇక తమిళనాట కూడా రెండు సినిమాల్లో నటిస్తుంది. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − twelve =