భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన రొమాంటిక్ డ్రామా “అర్జున్ రెడ్డి” మూవీ 2017 సంవత్సరం ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. షాలిని పాండే కథానాయిక. “అర్జున్ రెడ్డి” మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఫ్రస్టేటెడ్ లవర్ గా విజయ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. అభిమానులలో తనపెర్ఫార్మెన్స్ తో విజయ్ క్రేజ్ ను పెంపొందించుకున్నారు. “అర్జున్ రెడ్డి” మూవీ సందీప్ రెడ్డి వంగ కు దర్శకుడిగా మొదటి చిత్రం కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




“అర్జున్ రెడ్డి” మూవీ నేటితో 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ విజయ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. “అర్జున్ రెడ్డి” మూవీ ని హిందీలో “కబీర్ సింగ్”గా రీమేక్ చేసి సందీప్ రెడ్డి బాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. హీరో షాహిద్ కపూర్ , కియారా అద్వానీ జంటగా రూపొందిన “కబీర్ సింగ్” మూవీ ఘనవిజయం సాధించింది. రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి, హీరో షాహిద్ కపూర్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. “కబీర్ సింగ్” మూవీ 379 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ తో 2019 సంవత్సరం సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ బాలీవుడ్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ ఘనవిజయం సాధించడంతో హీరోయిన్ కియారా అద్వానీ బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























