అవి రూమర్స్ – నాన్న ఆరోగ్యంపై నేనే అప్ డేట్స్ ఇస్తా..!

SPCharan Quashes Rumors About SP Balasubrahmanyam Health Condition

గత రెండు రోజుల క్రితం బాలు ఆరోగ్యం ఇంకా ఆందోళనకరంగానే ఉందని చెప్పడంతో అందరూ చాలా కంగారు పడ్డారు. అయితే ఈ రోజు ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్టు.. ఆయనకు మరోసారి కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక బాలు ఆరోగ్యం నిలకడగా ఉందన్న వార్తలు రావటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పుడు బాలుకి కరోనా నెగిటివ్ వచ్చిందన్న వార్తలపై ఎస్పీ చరణ్ స్పందించి ఆ వార్తలను ఖండించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాన్నగారి ఆరోగ్యం గురించి ఈ రోజు ఉదయం రూమర్ ఒకటి బయటకు వచ్చింది.. నాన్నగారికి కరోనా నెగిటివ్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి.. కరోనా పాజిటివ్ ? నెగిటివ్? సంగతి పక్కన పెడితే.. డాక్టర్స్ నుండి ఏ విషయమైనా ముందు నాకే తెలుస్తుంది.. సో ఎప్పటికప్పుడు మీకు నాన్న ఆరోగ్యం గురించి అప్ డేట్స్ నేనే ఇస్తా.. రూమర్స్ నమ్మొద్దు అని తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీదనే ఉన్నారు.. కొంచం పర్వాలేదు.. డాక్టర్స్ తో మాట్లాడి సాయంత్రం నాన్నగారి హెల్త్ కండీషన్ ఎలా ఉందో చెప్తా అంటూ క్లారిటీ ఇచ్చారు.

 

కాగా, కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. కొద్ది పాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, త్వరలోనే కోలుకుంటానని కూడా వీడియో ద్వారా తెలిపారు. జలుబు, జ్వరం వంటి స్వల్ప లక్షణాలతో బాధపడిన బాలు తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్పటినుండి బాలుకి చికిత్స అందిస్తూనే వున్నారు. మరోవైపు బాలు భార్యకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె కూడా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

ఇక ఇదిలా ఉండగా బాలు త్వరగా కోలుకోవాలని సెలెబ్రిటీస్ దగ్గరనుండి సామాన్యుల వరకూ, ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రార్థనలు అందించారు.బాలు తొందరగా కోలుకొని ఆరోగ్యంగా తిరిగిరావాలని మనం కూడా కోరుకుందాం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 2 =