ఆమె బయోపిక్ లో నటించాలని ఉంది..!

Actress Aishwarya Rajesh Reveals Her Wish To Act In The Biopic Of Legendary Actress Manorama

ఈ మధ్య కాలంలో బయోపిక్ ల హవా బాగానే నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ్ ఇలా పలు ఇండస్ట్రీల్లో ఇప్పటికే ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయనేతలు, క్రీడా ప్రముఖులు ఇలా చాలా మంది జీవిత చరిత్రలే తెరకెక్కాయి. ఇంకా చాలా మంది బయోపిక్ లు లైన్ లో వున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తనకు కూడా ఒక వెటరన్ యాక్ట్రెస్ బయోపిక్ లో నటించాలని ఉంది అంటుంది టాలెంటెడ్ యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్. ఇంతకీ ఐశ్వర్య రాజేష్ నటించాలనుకున్న హీరోయిన్ ఎవరనుకుంటున్నారా..? ఆమె ఎవరో కాదు నటి మనోరమ. దివంగత నటి మనోరమ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తమిళంతోపాటు తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించారు మనోరమ. దాదాపుగా 1500కు పైగా సినిమాల్లో ఆమె నటించారు. ఐదువేలకు పైగా నాటకాలు వేశారు. అలాగే, పలు టీవీ సీరియల్స్‌లో కనిపించారు. ఎన్నో గొప్ప సినిమాల్లో నటించిన మనోరమ 78 ఏళ్ల వయసులో 2015లో కన్నుమూశారు. అలాంటి నటి మనోరమ బయోపిక్‌లో నటించాలని ఉందని.. ఆమె పాత్రలో నటించి జాతీయ స్థాయిలో అవార్డు పొందాలని ఆశపడుతున్నానని, అది త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నానని తెలుపుతుంది ఐశ్వర్య రాజేష్. మరి త్వరలోనే ఐశ్వర్య రాజేష్ కల నెరవేరాలని కోరుకుందాం.

కాగా విభిన్నమైన కథలతో.. తన నటనతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. ప్రస్తుతం ‘భూమిక’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది ఐశ్వర్య రాజేష్. ఈ చిత్రానికి రతీంద్రన్‌ ఆర్‌.ప్రసాద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక్‌ సుబ్బురాజ్‌, సుదన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్‌ సైక్రియాటిస్టు పాత్రలో నటిస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − 2 =