సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ..!

Actress Rambha To Make Her Comeback In To Movies

ఒకప్పుడు స్టార్ హీరోల పక్కన స్టార్ హీరోయిన్లు గా వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లు ఎంతోమంది సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసందే. హీరోయిన్లుగా కాదులే కానీ ఈ జనరేషన్ లో స్టార్ హీరోల పక్కన ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఏదో పాత్ర దక్కింది చేస్తున్నాం అన్నట్టు కాకుండా.. దర్శకులు కూడా ఏదో వారిని తీసుకోవాలి.. పాత్ర ఇవ్వాలి అన్నట్టు కాకుండా.. సినిమాకే వాళ్ళు కీలక పాత్రలుగా చేస్తున్నారు. వాళ్ళ ద్వారానే సినిమా నడిచే పాత్రలను సృష్టిస్తున్నారు. ఉదాహరణకు రమ్యకృష్ణ, నదియా, విజయశాంతి, మీనా అలా పలువురు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి కీలకపాత్రలతో అలరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో హీరోయిన్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది ఆ హీరోయిన్ ఎవరో కాదు రంభ. రంభ సినిమాలకు దూరమై చాలా ఏళ్ళే అవుతుంది. ఎప్పుడెప్పుడో వచ్చిన యమదొంగ, దేశముదురు సినిమాల్లో పాటలో కనిపించిన రంభ ఆ తర్వాత కనిపించలేదు. ఇక ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం పలు పొడక్షన్ హౌస్ లు పలు ఇంట్రెస్టింగ్ కథలతో రంభను అప్రోచ్ అవుతున్నారట. మరి ఎలాంటి కథతో రంభ రీ ఏంటీ ఇస్తుందో చూడాలి.

ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రంభ. ఆ తరువాత స్టార్ హీరోలతో చాలా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకుంది. తెలుగు, తమిళ్, హిందీ, బోజ్ పురీ భాషల్లో చాలా సినిమాలే చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 16 =